Health

సిగరెట్ తాగే వారి ఊపిరితిత్తులు ఎలా మారిపోతాయో చుడండి.

ఊపిరితిత్తులు మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల, నత్తల శ్వాసవ్యవస్థలోని ప్రధాన అవయువాలు. ఇవి క్షీరదాల్లో, ఇంకా చాలా సకశేరుకాల్లో వెన్నెముక సమీపంలో గుండెకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. అయితే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరా డిసీజ్ స్థూలంగా సీఓపీడీ. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు కుదించుకుపోతుంటాయి.

ఫలితంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో శరీరం నుంచి కార్బన్ డై ఆక్స్డైడ్ బయటకు వెలువడదు. సీవోపీడీ కారణంగా గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి మహిళలకు ఎక్కువగా సోకే ప్రమాదముంది. సీవోపీడీ లక్షణాలు.. సీవోపీడి లక్షణాలు సాధారణంగా చాలా ఆలస్యంగా బయటపడతాయి.

సీవోపీడీలో ప్రధాన లక్షణం దీర్ఘకాలం పాటు దగ్గు ఉండటం లేదా కఫం పేరుకుపోవడం. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యక్తి రోజంతా దగ్గుతో ఇబ్బంది పడుతుంటాడు. ఒకవేళ మీరు 4-8 వారాల్నించి దగ్గుతో ఇబ్బంది పడుతుంటే సీవోపీడీ లక్షణం కావచ్చు. ఈ వ్యాధి ఉన్నప్పుడు అకారణంగా బరువు తగ్గిపోవడం గమనించవచ్చు.

మరోవైపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మెట్లెక్కడంలో అలసట ఎదురౌతాయి. ఊపిరితిత్తుల బలహీనంగా ఉండటాన్ని సూచిస్తాయి. సీవోపీడీ ఉంటే..కఫం పసుపు లేదా పచ్చగా ఉంటుంది. సీవోపీడీతో పాటు ఈ వ్యాధుల ముప్పు.. సీవోపీడీ సమస్యతో బాధపడేవారికి జలుబు, ఫ్లూ వంటివి త్వరగా సోకుతకాయి. సీవోపీడీ రోగులల్లో గుండె వ్యాధుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది.

సీవోపీడీ రోగుల్లో బ్లడ్ ప్రెషర్, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఎలా రక్షించుకోవాలి.. ఈ వ్యాధి నుంచి కాపాడుకునేందుకు కొన్ని వస్తువులున్నాయి. వీటిని లైఫ్‌స్టైల్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. సిగరెట్ ఎక్కువగా స్మోక్ చేసేవారిలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ. ఈ వ్యాధి నుంచి విముక్తి పొందేందుకు ముందుగా స్మోకింగ్ మానేయాలి. దుమ్ము ధూళి, కెమికల్స్‌కు దూరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలపై ఫోకస్ పెట్టడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker