మద్యం, సిగరేటు తాగితే పిల్లలు పుట్టరా..! అసలు విషయం చెప్పిన వైద్య నిపుణులు.
పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకొన్నా కూడా మూడు నెలల పాటు వీర్యంలో శుక్రకణాల సంఖ్య, వాటి కదలిక తక్కువగా ఉంటున్నదని తెలిపింది. అయితే సంతానలేమి సమస్యలకు మధ్యపానం, దుమాపానం కూడా కారకాలేనని వైద్యులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలుపాటించకపోతే అంతే సంగతులంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది దంపతులు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లి జరిగి 10 సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టక.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే సంతానలేమి సమస్యకు అనారోగ్య సమస్యలు కొన్ని కారణాలు అయితే ఆహారపు అలవాట్లు, మధ్యపానం, దుమాపానం అనేవి కూడా ప్రధాన కారణాలని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ సంతానలేమి సమస్య వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పురుషుల వంధ్యత్వానికి దారితీసే అనేక కారణాలలో ధూమపానం ప్రధాన కారణం. గర్భం అనేది ప్రతి ఒక్క మహిళాకు గొప్ప వరం. పెళ్ళైన తరువాత అమ్మ అనే పిలుపు కోసం ఎన్నో విధాలా పూజలు, వ్రతాలూ చేస్తుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన లేదా అనారోగ్య సమస్యల కారణంగా అమ్మ అనే పిలుపించుకోలేరు.ఈ ఆనందాన్ని అనుభవించకపోవటం వలన కలిగే బాధ మానసిక క్షోభకు గురి చేస్తుంది.
జంటలలో వంధ్యత్వానికి దారితీసే అనేక ఆరోగ్య కారకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి వైద్య చికిత్స ఉంటే మరికొన్ని వారి నియంత్రణలోనే ఉంటాయి. కానీ చాలామంది ఆ సమస్యను గ్రహించలేక మధ్యపానం, దుమపానం వంటివి సేవించి వారి నియంత్రణను కోల్పోతారు. దీని ఫలితం మగవారిలో వంధ్యాత్వానికి దారి తీస్తుంది. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో స్పెర్మ్ అభివృద్ధి చెందడానికి మూడు నెలలు పడుతుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్తత్తి కావాలంటేనిర్ణయించేది ఆహారం, వ్యాయామం.మద్యపానం,ధూమపానం ప్రభావంతో వీర్య కణాల కదిలికపై ఎఫెక్టు పడుతుందన్నారు.
సిగరెట్లలో నికోటిన్ వంటి విష పదార్దాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా అధిక స్థాయిలో కాడ్మియం, సీసం వంటి లోహాలకు గురవుతారు.ఇవి పురుషులలో సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలవుతాయి. సీసం, కాడ్మియం స్థాయిలు వీర్య కణాల నాణ్యతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పేలవమైన స్పెర్మ్ అనేది ఏకాగ్రత కోల్పోయి ఆకృతి, కదలిక ఏర్పడుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంతా మధ్యపానం, ధూమాపానానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.