ఈ చిట్కాలు పాటిస్తే చాలు, మీ కరెంటు బిల్లు సగానికి తగ్గిపోతుంది.
ఈ రోజుల్లో కరెంట్ ఛార్జీలు కూడా మరింత ప్రియంగా మారాయి. అందులోనూ వేసవికాలంలో కూలర్స్, ఫ్యాన్స్ తదితర వస్తువులు వాడటం వల్ల కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతుంది. ఈ క్రమంలో సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. లైట్, ఫ్యాన్, ఏసీ లైట్ ఆఫ్ చేయకుండానే గదిలో నుంచి బయటకు వెళ్లే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా లైట్ ఆఫ్ చేయకుండా బయటికి వెళ్లి వాటి గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. దీనివల్ల అనవసరంగా కరెంట్ ఖర్చు అవుతుంది.
అయితే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అంతేకాకుండా ఈ వేసవిలో కరెంటు బిల్లు తడిసి మోపుడవుతోంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతుంది. మీకు ప్రతి నెలా ఎక్కువగా పవర్ బిల్లు వస్తుంటే.. ఈ సింపుల్ చిట్కాలతో సగానికిపైగా తగ్గించవచ్చు. వేసవి కాలంలో ఈ గాడ్జెట్లను ఉపయోగించడం మీరు విద్యుత్ ను ఆదా చేయవచ్చు. సోలార్ ప్యానెల్.. సౌర శక్తిని విద్యుత్ మార్చడానికి సౌర ఫలకాలను ఉపయోగిస్తారు.
ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చడంలో సోలార్ ప్యానెల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఎనర్జీ సేవింగ్ లైట్.. ఎనర్జీ సేవింగ్ లైట్లు తక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని ఉపయోగించే బల్బులు. ఈ బల్బులను ఉపయోగించడం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించవచ్చు. దీంతో పవర్ బిల్లు మీకు చాలా తక్కువగా వస్తుంది.
స్మార్ట్ ప్లగ్‌లు.. ఇంటిలోని ఎలక్ట్రికల్ ఉపకరణాలను సులభంగా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి స్మార్ట్ ప్లగ్‌లను ఉపయోగిస్తారు. వీటిని స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర స్మార్ట్ పరికరం ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా టైమర్‌ని సెట్ చేయడం ద్వారా వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దీనితో మీరు విద్యుత్తును ఆదా చేయవచ్చు. మరోవైపు పవర్ కట్ స్విచ్‌లను ఉపయోగించడం ద్వారా కూడా విద్యుత్తు బిల్లును తగ్గించుకోవచ్చు. స్మార్ట్ థర్మోస్టాట్. విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ థర్మోస్టాట్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
దీనిని మీ స్మార్ట్‌ఫోన్ నుండి కూడా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా మీ ఇంటి ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించవచ్చు. ఇది ఎయిర్ కండీషనర్ కోసం కూడా ఉపయోగించబడుతుంది. స్మార్ట్ మీటర్.. మనం ఎంత విద్యుత్ ఉపయోగించామనేది స్మార్ట్ మీటర్ బట్టి చెప్పేయచ్చు. ఈ మీటర్లు కరెంటు బిల్లును తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇవి ఓ చిప్‌ను కలిగి ఉంటాయి.