చిన్న వయసులోనే బట్టతల రావడానికి ప్రధాన కారణాలు ఇదే.
కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. కొంత మందికి చిన్న వయస్సులోనే జట్టు రాలుతుంటుంది. సాధారణంగా సైన్స్ ప్రకారం చూస్తే బట్టతల అనేది మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా వస్తుంది. వెట్రుకలు రాలిపోవడానికి ప్రధాన కారణం మనిషి తీవ్ర ఒత్తిడితో ఉండటం, పోషకాహార లోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదిలా ఉంటే.. పలు చికిత్సల ద్వారా జుట్టు రాలాడాన్ని తగ్గించడమే కాదు.. మళ్లీ జుట్టు పెరిగేలా చేయొచ్చునని ఓహియో యూనివర్సిటీ డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుసాన్ మాసిక్ తెలిపారు.
సమతుల్య ఆహారం, సమయోచిత మినాక్సిడిల్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయన్నారు. ప్రొటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని మాసిక్ తెలిపారు. జుట్టు రాలడం అనేది ఒత్తిడి, ‘అలోపేసియా అరేటా’ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల సంభవించవచ్చు. 21 సంవత్సరాల వయస్సులోపు, 25 శాతం మంది పురుషులలో జుట్టు రాలిపోయే సంకేతాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 70 శాతం మందికి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
పురుషులలో బట్టతల రావడానికి కారణాలు..డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అనే హార్మోన్ వల్ల పురుషులలో బట్టతల వస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా జుట్టు సన్నబడటమే కాదు.. చాలా సులభంగా రాలిపోతుంది. ఈ ఆహారాలతో బట్టతల నివారణ..ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, బచ్చలికూర, గొడ్డు మాంసం, చిక్పీస్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ వంటి సమతుల్యమైన ఆహారాలు మీ జుట్టు ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండటంలో సహాయపడతాయి. హెయిర్ ఫోలికల్స్ ప్రోటీన్, ఐరన్‌తో తయారవుతాయి. ఇవి శరీరంలో జుట్టు పెరుగుదలకు దోహదపడే కణాలకు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడతాయి.