Health

నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుంటే చివరికి ఏం జరుగుతుందో తెలుసుకోండి.

సరైన వైద్య సలహా లేకుండా దుర్వినియోగమయ్యే ఔషధాల్లో నిద్ర మాత్రలు లేదా సెడేటివ్స్‌ అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం చాలా అధికంగా ఉంది. నిద్ర మాత్రలు ఎక్కువ కాలం వాడటం వల్ల వీటికి అలవాటు పడటం జరుగుతుంది. ఏ నిద్రమాత్రలైన 15 రోజులకు మించి వాడటం మంచిదికాదు. తాత్కాలికంగా ఇతర మందులతో కలిపి వైద్యులు వాడాలని సూచిస్తారు. అయితే అలవాటు పడిన స్లీపింగ్ పిల్ మెదడును క్రమంగా ప్రభావితం చేస్తుంది.

ఈ విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ యాంటీ కోలినెర్జిక్ మాత్రలు, నిద్ర మాత్రలు మీ జ్ఞాపకశక్తిని క్రమంగా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తికి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ మందులు వాటంతట అవే ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు కూడా ఇలాంటి మాత్రలు వాడితే.. ఒక నెలలోనే దాని ప్రభావం కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్ర మాత్రలు ప్రమాదకరం..ప్రపంచవ్యాప్తంగా స్లీపింగ్ మెడిసిన్ వాడేవారి మరణాల రేటు పెరిగింది.

కానీ స్లీపింగ్ మెడిసిన్ తీసుకోని వారి సంఖ్య తక్కువగా ఉంది. నిద్రమాత్రలు వాడటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర మాత్రలు తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. దీని రెగ్యులర్ వినియోగంతో మలబద్ధకం, బలహీనమైన జ్ఞాపకశక్తి, కడుపు నొప్పి, బలహీనత, మైకము వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, మీరు నిద్రపోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker