పడుకునే ముందు ఈ పని చేస్తే చాలు, గాఢ నిద్రలోకి జరుకుంటారు.
నిద్ర ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కొంతమందికి రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టదు, కష్టంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు.
నిద్రరాక అనవసరపు ఆలోచనలు చేస్తారు. కానీ, మీకు నిద్రపట్టడం లేదంటే అది అలసట వల్ల కూడా కావచ్చు. కారణమేదైనా మీరు మంచం మీద పడుకున్న వెంటనే గాఢ నిద్రను పొందాలనుకుంటే, ముందుగా మీ శరీరానికి కొంత విశ్రాంతి అనుభూతిని కలిగించాలి. ఇందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, చూడండి. మీ కళ్ళను కడగండి..శరీరం విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధం చేయడానికి సులభమైన మార్గం నిద్రపోయే ముందు మీ కళ్ళను కడగడం.
దీని కోసం చల్లటి నీటిని ఉపయోగించడం మంచిది. రోజంతా ఎండ, వాన, దుమ్ము, మట్టి కారణంగా కళ్లలో సమస్యగా ఉంటుంది, దీంతో కళ్లు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాయి, కాబట్టి. చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కుంటే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. గోరువెచ్చని నీటితో రిలాక్స్..నిద్రపోయే ముందు శరీరాన్ని రిలాక్స్ చేయడానికి, గోరువెచ్చని నీటిని ఒక బకెట్‌లో తీసుకుని, ఆ తర్వాత అందులో మీ పాదాలను కాసేపు నానబెట్టండి.
ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులు తగ్గుతాయి. దీనితో పాటు, అలసట కూడా తక్కువగా ఉంటుంది. మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. కాళ్లు చేతులు కడుక్కోవాలి..రోజంతా వివిధ పనులు చేసి అలసిపోయిన తర్వాత తలస్నానం చేస్తే చాలా రిలాక్స్ గా ఉంటుంది, అయితే స్నానం చేయాలని ,మీకు అనిపించకపోతే నిద్రపోయే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవాలి. ఈ అలవాటు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.
శ్వాస వ్యాయామాలు.. నిద్రకు ముందు కొంత సమయం పాటు ధ్యానం చేయవచ్చు, ఈ సమయంలో శ్వాస వ్యాయామాలు కూడా సాధన కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది, మీకు గాఢ నిద్ర వస్తుంది.