మధ్య రాత్రిలో పదే పదే మెలుకువ వస్తోందా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?
మధ్య రాత్రుల్లో మెలుకువ గనుక వస్తూ ఉంటే, 7 నుండి 8 గంటల సేపు ఎంతో అవసరమైన నిద్ర మీకు లభించడం లేదు అని అర్ధం. ఈ స్థితిని మధ్యస్థ నిద్రలేమిగా భావిస్తుంటారు. అయితే రాత్రిపూట కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి.
బంగాళాదుంపలు, చిప్స్, పాస్తా, అన్నం, అరటిపండ్లు వంటి వాటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు మీ నిద్రకు బంఘం కలిగిస్తాయి. వీటిని తింటే రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలుకువ వస్తుంది. అందుకే రాత్రిళ్లు వీటిని తినకండి. ఇండియాలో టీ, కాఫీ ప్రియులకు కొదవే లేదు. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు అసలే తాగకూడదు. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత. ఒక వేళ తాగితే మీరు ఏం చేసినా రాత్రిళ్లు రాదు.
తెల్లవార్లూ జాగారం చేయాల్సిందే. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే కెఫిన్ మనల్ని రీఫ్రెష్ చేసి నిద్రమత్తును వదిలిస్తుంది. అందుకే నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల మందు టీ, కాఫీలను అసలే తాగకండి. ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో కూడిన లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఒత్తిడి సర్వ సాధారణం అయినప్పటికీ.. అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా ఒత్తిడికి గురైతే మీ ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది.
ముఖ్యంగా ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా దెబ్బతిస్తుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా పడుకోవడానికి ప్రతిరోజూ అర్థగంట అయినా వ్యాయామం చేయండి. పొద్దున్న సూర్యరశ్మిలో కాసేపు నిలబడండి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే.. బాదం, అవొకాడో, ఆకుకూరలు, గుమ్మడి గింజలను ఎక్కువగా తినండి. రాత్రిపూట మరీ హెవీగా తినకండి. ఎలాంటి ఆలోచనలు చేయకండి.