Health

నిద్రకు ముందు రెండు లవంగాలు తింటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

లవంగం, లవంగం నూనె పళ్లు, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. వ్యాధుల్ని నియంత్రిచడంలోనూ లవంగాలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అయితే లవంగం వంట రుచిని మాత్రమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా చక్కగా మెరుగుపరుస్తుంది. లవంగం ఘాటుగా రుచిగా ఉంటుంది. వంటల్లో వాడటం వలన రుచి, వాసన పెరుగుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి బ్యాక్టీరియా, వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. అయితే లవంగాలను నిద్రకు ముందు ఉపయోగిస్తే.. ఎన్నో లాభాలు ఉంటాయి. పొటాషియం, ఐర‌న్, క్యాల్షియం వంటి ఎన్నో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ లవంగంలో దొరుకుతాయి. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని చప్పరించి.. న‌మిలి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం కావొచ్చు. అయితే రాత్రి పడుకునే ముందు కూడా లవంగం తినండి. ఈ కాలంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక ల‌వంగాన్ని నోట్లో వేసుకుని తింటే మంచిది. ఒత్తిడి త‌గ్గి చక్కగా నిద్రపడుతుంది. ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల దంతాల నొప్పులు రావు.

దంతాలు పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ల‌వంగాల‌ను తింటే జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. సుల‌భంగా బ‌రువు కూడా తగ్గవచ్చు. ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తపోటు అదుపులో కూడా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. చాలామంది మలబద్ధకంతో బాధపడుతారు. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమిలి.. తినేసి.. గోరు వెచ్చని నీరు తాగాలి. ఇలా రెగ్యూలర్ గా చేస్తే.. మలబద్ధకం సమస్య ఉండదు. రాత్రి నిద్రించే ముందు ఒకటి లేదా రెండు లవంగాలు తింటే.. అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మెుటిమలు రాకుండా అడ్డుకుంటాయి.

గొంతు నొప్పిని తగ్గించడలోనూ లవంగాలు పని చేస్తాయి. రోజూ లవంగాలు తీసుకోవడం వలన మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి పడుకునే ముందు ఒకటి లేదా రెండు లవంగాలు తినండి. వీలైతే గోరు వెచ్చని నీరు తాగండి. దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్, సైనస్, ఉబ్బసం నుంచి కూడా బయటపడేందుకు లవంగం ఎంతో సహాయపడుతుంది. మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి, మళ్లీ తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం ఉండొచ్చు. త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker