మీరు కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.
మనం కూర్చునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనావిధానాన్ని తెలియజేస్తాయంట. ఇదేదో నోటి మాట కానే కాదు. అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైన విషయం ఇది. మరి ఆ క్రమంలో మీరు కూర్చున్న పోజిషన్ కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అయితే మనం కూర్చునే స్థితిని బట్టి మన వ్యక్తిగత ఆలోచన ఎలా ఉంటుందో చెప్పవచ్చు. నిపుణుల అధ్యయనం ప్రకారం కూర్చునేటప్పుడు లెగ్ పొజిషన్ను బట్టి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది అన్న విషయాన్ని కనుగొన్నారు.
కూర్చునే స్థితిని బట్టి భావోద్వేగాలు, ఆందోళన విసుగు అభద్రత భావాలు మొదలైన విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. ఒక అధ్యయనంలో కాలు పై కాలు వేసుకుని కూర్చునేవారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. వీరు సమూహంలో కూర్చున్నప్పుడు వాడు ఒకటి మాట్లాడితే వీరు వేరే విషయంపై ఊహాలోకంలో తేలుతుంటారు. వీరు ఎక్కువగా అజాగ్రత్త భావాన్ని కలిగి ఉంటారు. మోకాళ్లు నిటారుగా ఉంచి కూర్చున్న వ్యక్తులు ఉద్యోగానికి అర్హతలు కలిగిన వారిగా గుర్తించడం జరిగింది.
ఇలా కూర్చున్న వారిలో ఆత్మవిశ్వాసం నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. అదేవిధంగా అభద్రత భావాన్ని తక్కువ కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా ప్రశాంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాలు పై కాలు వేసుకుని కూర్చునేవారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. వీరు సమూహంలో కూర్చున్నప్పుడు వాడు ఒకటి మాట్లాడితే వీరు వేరే విషయంపై ఊహాలోకంలో తేలుతుంటారు.
వీరు ఎక్కువగా అజాగ్రత్త భావాన్ని కలిగి ఉంటారు. మోకాలు వేరుగా ఉంచుకొని కూర్చునే వ్యక్తులు అహంకార భావాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారి మాటలకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు. ఎదుటి వారు చెప్పే మాట వినకుండా వాళ్ళు చెప్పిందే గెలవాలని చూస్తారు. వీరు ఏది చేసినా ఎక్కువ విసుగు చెందుతారు. ఆత్రుత చింతించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వాళ్ల వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఎక్కువగా భయపడుతుంటారు.
ఒక మోకాళ్ళపై మరొక కాలు పాదాన్ని వేసుకొని కూర్చునేవారిలో కూర్చున్న వారికి ఆత్మ విశ్వాసం ఆధిపత్యం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా, సంతృప్తిగా ఉంటారు. ఏదన్నా నేర్చుకోవాలనే విషయంలో ముందు స్థానంలో ఉంటారు. వీరు ఎక్కువగా విద్యకు ప్రాముఖ్యతనిస్తారు. ఎంత కష్టమైన శ్రమించి ఫలితాన్ని సాధిస్తారు.