Health

నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

కుర్చీ, బల్లపై కూర్చునే దానికంటే నేలపై కూర్చుకోవటం వల్ల స్ధిరత్వం ఉంటుంది. కుర్చీల్లో కూర్చోవటం వల్ల తుంటి బాగం బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. అయితే నేతలపై కూర్చోవటం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. కండరాలను సాగదీయడంలో , చలనశీలతను పెంచటంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఇది ఒకరకమైన శారీర శ్రమలాంటిదే. కాళ్ళ దిగువ కండరాలను సాగదీసేందుకు కింద కూర్చోవటం అన్నది దోహదపడుతుంది. అయితే పూర్వకాలంలో ఇంటిల్లిపాది కలిసి నేలపై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు.

కానీ ఈ జనరేషన్ వారు డైనింగ్ టేబుల్ కి అలవాటు పడి కింద కూర్చొని తినడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికీ గ్రామాలలో చాలా మంది కింద కూర్చొనే భోజనం చేస్తున్నారు. నేలమీద కూర్చొని భోజనం చేస్తే సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయట. తినడానికి నేలపై కూర్చున్నప్పుడు కచ్చితంగా కాళ్లు మడతపెట్టి కూర్చుంటారు. దానినే సుఖాసన లేదా సగం పద్మాసన అని పిలుస్తారు.

ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకి సంకేలు అందుతాయి. ఫ్లేట్ ప్లోర్ పై ఉండంతో ఆటోమెటిక్ గా శరీరం కిందికి వంగుతుంది. ఆహారం తీసుకున్న తరువాత మళ్లి వెనక్కి కూర్చున్న పొజిషన్ కి వస్తుంది. ఇలా వెనక్కి, ముందుకు వెళ్లడం వల్ల పొట్టలో ఉండే కండరాలు చాలా యాక్టివేట్ అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నేలమీద కూర్చొని తింటే బరువు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కొంత మంది డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. దీంతో అధిక బరువు పెరుగుతుంటారు. మనకు సరిపోయేంత తిన్నామా.. లేదా అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకి సిగ్నల్స్ ని అందించే ఒకనాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ్లోర్ పై కూర్చొని తినడం వల్ల జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచుకుంటారు. న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడానికి సహాయపడుతుంది. స్మెల్, టేస్ట్, టెక్చర్, ఎంత తింటున్నామనే విషయాలను ప్లోర్ పై కూర్చొని తినడం వల్ల గమనిస్తారట. సాంప్రదాయకంగా భారతీయులు కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేస్తారు. ఇది ఒకరికొకరూ రోజు ఎలా గడిచిందో తెలుసుకోవడంలో.. బంధం ఏర్పరచుకోవడంలో ఉపయోగపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker