News

డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్, ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.

అమెరికాలో గన్స్, డ్రగ్స్ కల్చర్ విలయతాండవం చేస్తున్నాయి. మైనర్లు సైతం గన్స్ తో రెచ్చిపోతున్నారు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ యూత్ డ్రగ్స్ తో మత్తులో జోగిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డ్రగ్స్ వాడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పార్టీ కల్చర్ లో ఈ మధ్య డ్రగ్స్ వాడకం సర్వసాధారణం అయ్యింది. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, రాపర్, మోడల్ నిక్కీ మినాజ్‌ను నెదర్లాండ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిషేధిత డ్రగ్‌ను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని నిక్కీ మినాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌గా వీడియో చేసింది. ఈ సంఘటన ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో జరిగింది. నిక్కీ మినాజ్‌ను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు తెలిసింది. నిక్కీ మినాజ్‌ని ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేయగా, ఆమె బ్యాగ్‌లో కొన్ని ‘సాఫ్ట్ డ్రగ్స్’ కనిపించాయి. ఆ వస్తువులు నెదర్లాండ్స్‌లో నిషేధం. దీంతో పోలీసులు నిక్కీని అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో ఆమె తన మొబైల్ ఫోన్‌లో సంఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించింది. డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత, ‘ఆ వస్తువులు నావి కావు, నా సెక్యూరిటీ గార్డుకి చెందినవి’ అని నిక్కీ మినాజ్ చెప్పింది. అయితే పోలీసులు ఆ మాటను అంగీకరించలేదు. చివరగా, పోలీసులు నిక్కీ మినాజ్‌ను తమ కారులో కూర్చోమని కోరారు. అయితే ఆ తర్వాత నిక్కీ మినాజ్ నిరసన వ్యక్తం చేసింది. ‘ఇప్పుడు ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తారా’ అని అడిగాడు.

దానికి పోలీసులు సమాధానం చెప్పకుండా కేవలం కారులో కూర్చోమని చెప్పడం వీడియోలో రికార్డయింది. నిక్కీ మినాజ్ ఇంగ్లాండ్‌లో కొన్ని లైవ్ షోలను ప్రదర్శించాల్సి ఉంది. మాంచెస్టర్‌తో సహా కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో నిక్కీ మినాజ్ లైవ్ గిగ్ షోలు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలకు అన్ని సన్నాహాకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు నిక్కీ మినాజ్ అరెస్ట్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దయి వందల కోట్ల నష్టం వాటిల్లింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker