షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న పాక్ నటి సనా జావేద్ కి కూడా రెండో పెళ్లేనా..!
ఇప్పుడు మరో సెలబ్రెటీ జంట కూడా విడిపోయింది. కొద్దికాలంగా దూరంగా ఉంటున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్, భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా జోడి విడిపోయింది. వీరి విడాకుల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయినా కూడా ఎవ్వరూ బయటపడలేదు. కొన్ని హార్డ్ మెసేజ్ లు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు తప్పితే విడాకుల విషయం బయటపడలేదు.
అయితే షోయబ్ మాలిక్, సనా జావేద్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. గత ఏడాది సనా పుట్టినరోజు సందర్భంగా పాకిస్థానీ క్రికెటర్ శుభాకాంక్షలు తెలపడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “హ్యాపీ బర్త్‌డే బడ్డీ” అని రాశారు. సనా జావేద్, సౌదీ అరేబియాలోని జెడ్డాలో 1993 మార్చి 25న జన్మించింది. ఈ పాకిస్థానీ నటి ఉర్దూ టెలివిజన్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది.
యూనివర్సిటీ ఆఫ్ కరాచీ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’తో రంగప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఖానీ, రుస్వాయి, డంక్ వంటి నాటకాలలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. 2017లో, ఆమె ‘మెహ్రున్నీసా వి లవ్ యు’ అనే సోషియో-కామెడీ చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెట్టింది. సనా జావేద్‌కి ఇంతకు ముందే వివాహమైంది.
ఆమె 2020 అక్టోబర్లో కరాచీలో నికాహ్ వేడుకలో పాకిస్థానీ నటుడు, గాయకుడు-గేయరచయిత ఉమైర్ జస్వాల్‌ని వివాహం చేసుకుంది. Siasat.com ప్రకారం.. 2023లో వీరిద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి.. విడివిడిగా జీవించడం ప్రారంభించారు. సనా, ఉమైర్ కూడా తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు.