షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ హీరో, ఆయుర్వేదాన్నే నమ్ముకున్న స్టార్ హీరో.
యంగ్ హీరో అరుణ్ విజయ్, లండన్‌లో ‘అచ్చం ఎన్బందు ఇళయే’ మూవీ షూటింగ్‌లో గాయాలపాలయ్యారు. దీంతో ఇండియాకు తిరిగివచ్చిన ఆయన కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అరుణ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సా విధానం ద్వారా కాలి గాయానికి చికిత్స పొందుతున్నాను. అయితే ఇటీవల బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు 2 చిత్రీకరణ మలేషియాలో జరుగుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బోట్ ప్రమాదానికి గురైంది.
దీంతో ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లగా 30 ఎముకలు విరిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక రెండ్రోజుల క్రితం లేడీ డైరెక్టర్ సుధ కొంగర సైతం సెట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ హీరో అరుణ్ విజయ్ కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ప్రస్తుతం ఆయన నటిస్తోన్న అచ్చం ఎన్బదు ఇల్లైయే చిత్రీకరణ సమంయలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో అరుణా్ విజయ్ తోపాటు.. మరో వ్యక్తి కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన మోకాలికి కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. మోకాళ్లకు అయిన గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటున్నాను. ఇది నాలుగోరోజు చికిత్స. త్వరలోనే షూటిం గ్ లో పాల్గొంటాను. అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆయన ఫోటోస్ చూసిన అభిమానులు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో ల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అరుణ్ విజయ్. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ లో ప్రతినాయకుడిగా కనిపించారు అరుణ్ విజయ్. మాస్, యాక్షన్ లకు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టింది పేరు అరుణ్ విజయ్.
Behind all my hard-core actions you'll see on screen there are plenty of bruises like these… But still love doing my own stunts..😉 Wait for the next on screen..💪🏽
— ArunVijay (@arunvijayno1) November 26, 2022
Luv you all..❤️#AchchamEnbadhuIllayae #actorslife #nothingcanstop pic.twitter.com/UqTcsOhuiS