నటి షకీలాపై పెంపుడు కూతురు దాడి, పోలీసులను ఆశ్రయించిన షకీలా.
షకీలా చాలా కాలంగా శీతల అనే ఆవిడను పెంచుకుంటున్నారు. కూతురిలా చూసుకుంటున్న ఆమె ఊహించని విధంగా షకీలా పై దాడి చేసింది. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్థలు రావడంతో శీతల్ ఇంటినుంచి వెళ్లిపోయిందని తెలిపారు షకీలా. నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె తన తల్లితో తిరిగి వచ్చిందని.. తాను సర్దిచెప్పే ప్రయత్నం చేయగా తన పై తల్లితో కలిసి దాడి చేసిందని షకీలా పోలీసులకు తెలిపారు. అయితే షకీలా..తెలుగులో కూడా నటించిన సంగతి విదితమే. జయం, తొట్టి గ్యాంగ్, నిజం, దొంగోడు, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో అలరించింది. కాగా, నటి షకీలాపై దాడి చేసింది.
ఆమె దత్త పుత్రిక శీతల్ ఆమెపై దాడి చేసింది. చెన్నైలోని ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె కోడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దత్త పుత్రిక శీతల్‌తో జరిగిన గొడవలో తనకు, తన లాయర్ సౌందర్యకు గాయాలయ్యాయని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. శీతల్ షకీలా సోదరుడి కుమార్తె. ఆమెను అడాప్ట్ చేసుకుని సొంత బిడ్డలా సాకింది షకీలా.ఆరు నెలల ప్రాయంలోనే తన మేన కోడలు శీతల్‌ను కూతురిలా పెంచుతోంది. అనేక వేదికలపై కూడా ఆమె అత్త కాదని, అమ్మ అని శీతల్ కూడా మాట్లాడిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు ఇదే శీతల్ షకీలాపై దాడి చేయడం కోలీవుడ్ ఇండస్ట్రీ విస్మయానికి గురైంది. అయితే శీతల్, షకీలా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజుల నుండి విబేధాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి.. ఇద్దరి మధ్య గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని షకీలా ఇంటికి శీతల్, ఆమె సొంత తల్లి, సోదరితో కలిసి వెళ్లి దాడి చేసిందని సమాచారం. ఈ ఘటనలో షకీలా న్యాయవాదికి కూడా గాయాలయ్యాయి. శీతల్ తో సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పెంపుడు కూతురు కూడా షకీలాపై కంప్లయింట్ చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆమె ఓ టెలివిజన్‌లో షో ‘కుక్ విత్ కోమలి’ తన ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను అమ్మ అని పిలుస్తున్నారు. షకీలా జీవితంలో చోటుచేసుకున్న ఈ మార్పుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.