News

ఇండస్ట్రీలో మరో విషాదం, బాహుబలి RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య హఠాన్మరణం.

గత కొన్ని రోజులుగా సెంథిల్ భార్య రూహి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. రూహి యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ దూసుకుపోతున్నారు. అయితే ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె. సెంథిల్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో సినిమాటో గ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఇది ఇలా ఉంటే సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న భార్య రుచి కాసేపటి క్రిత‌మే క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల నుంచి రుచి ఆరోగ్యం బాగా క్షీణించి ప‌రిస్థితి చేజారిపోయింది.

శ్వాస తీసుకునేందుకు బాగా ఇబ్బంది పడింది. గురువారం రుచి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. రుచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో సెంథిల్ కుమార్ గత కొన్ని రోజులుగా పనికి దూరంగా ఉంటూ భార్యను చూసుకుంటున్నాడు. సెంథిల్ మరియు రుచి 2009లో వివాహం చేసుకున్నారు మరియు ఆమె వృత్తి రీత్యా యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. రుచి మరణంతో సెంథిల్ కుటుంబం షాక్‌కు గురైంది.

సెంథిల్ కుమార్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఐతే సినిమాతో సెంథిల్ కుమార్ సినీ కెరీర్ ప్రారంభ‌మైంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై, ఛ‌త్ర‌ప‌తి, అశోక్‌, అరుంధ‌తి, య‌మ‌దొంగ‌, ఈగ‌, బాహుబ‌లిస, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల‌కు సెంథిల్ ప‌ని చేశారు. దాదాపు రాజమౌళి అన్ని చిత్రాలకు సినిమాటో గ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ పని చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker