సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ నటుడు మృతి.
1976 వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ స్ముకా అనే సినిమాతో టామ్ విల్కిన్సన్ హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించాడు. మరోవైపు విల్కిన్సన్ రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. అయితే హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు బ్యాట్ మ్యాన్ మూవీ ఫేమ్ టామ్ విల్కిన్సన్ (75) కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. టామ్ విల్కిన్సన్ ‘బ్యాట్ మ్యాన్’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అంతేకాదు ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డులు నామినెట్ అయ్యారు. 1976 లో క్రైమ్ థ్రిల్లర్ ‘స్ముకా’చిత్రంతో టామ్ విల్కిన్సన్ హాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.
మొదటి సినిమా మంచి హిట్ అయ్యంది. తర్వాత విల్కిన్సన్ కు వరుస ఛాన్సులు వచ్చాయి. తన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 130 చిత్రాలకు పైగా నటించారు. టామ్ విల్కిన్సన్ నటించిన ది ఫుల్ మాంటీ, మైఖేల్ క్లెటన్, ది బెస్ట్ ఎక్సోటిక్ మేరిగోల్డ్ హూట్ మూవీస్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాయి.
అంతేకాదు ఈ మూవీలో ఆయన అద్భుత నటనకు ఆస్కార్ కి నామినేట్ అయ్యారు. 2001 లో కుటుంబ నాటకం ‘ఇన్ ది బెడ్ రూమ్’ కి ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డుకు ఎంపికయ్యాడు. 2007 జర్జ్ క్లూని నటించిన ‘మైఖేల్ క్లేటన్’ మూవీలో ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఎంపిక అయ్యారు. ఆయన నాటక రంగానికి చేసిన సేవలకు గాను 2005 లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ లో సభ్యునిగా నియమితులయ్యారు.
వెండితెరపై టామ్ విల్కిన్సన్ తన సహజమైన నటనతో మెప్పించేవారు. ఆయన మరణానికి సినీ సెలబ్రెటీలు, అభిమానులు నివాళుర్పించారు.