News

మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ కూతురు, సితారకు కొత్త గురువు ఎవరో తెలుసా..?

ఇన్ని రోజులు యానీ మాస్టర్ దగ్గర సితార డ్యాన్సులు నేర్చుకుంది. కానీ ఇప్పుడు కొత్త డ్యాన్సర్‌ వద్ద సితార స్టెప్పులు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ పక్కన స్టెప్పులు వేసిన డ్యాన్సర్ ఫాల్గుణి ఇప్పుడు సితారకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కొన్నిరోజుల క్రితం చిన్నారులకు అవసరమైన విషయాలను చెబుతూ నెట్టింట సందడి చేసింది. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో డాన్స్ రీల్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుతంది. కొన్నాళ్లుగా సితార డాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అటు క్లాసిక్ డాన్స్ క్లాసులు కూడా తీసుకుంది. ఫెస్టివల్స్ సమయంలో క్లాసికల్ డాన్స్ వీడియోస్ ఆకట్టుకున్నాయి.

అలాగే మహేష్ బాబు పాటలకు సైతం స్టెప్పులేసింది. ఇటీవల సూపర్ హిట్ గుంటూరు కారం సినిమాలోని ఓ.. మై బేబీ పాటకు ఎంతో అందంగా డాన్స్ చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మరో మాస్ పాటకు కాలు కదిపింది. గతంలో సితార కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. ఇక ఇప్పుడు డాన్సర్ ఫల్గుణితో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది.

ఓ హాలీవుడ్ పాటకు సితార, ఫల్గుణి కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సితార మాస్ డాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సితార అదరగొట్టేసిందని.. మాస్ పాటకు మహేష్ బాబును మించి డాన్స్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార మాస్ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే నటనపై ఆసక్తి ఉందని గతంలోనే సితార ఓ షోలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటినుంచే నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తల్లిదండ్రుల మాదిరిగానే సామాజిక సేవ చేయడంలో ముందుంటుంది. ఇప్పటికే తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైకిల్స్ బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker