ఈ సీడ్స్ ని ఇలా చేసి తీసుకుంటే జీవితంలో డాక్టర్ తో పని ఉండదు.
ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా నిండిన చియా సీడ్స్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. చియా సీడ్స్ రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె సమస్యలకు, బరువు తగ్గడానికి, బలమైన ఎముకలను నిర్మించడానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వీటిని స్మూతీలోనూ, సలాడ్స్‌లోనూ.. కొన్ని ముఖ్యమైన డిష్లలోనూ కలిపి తీసుకుంటారు. అయితే చియాసీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేయడంలో , రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అందుకే ఈ చిన్నచిన్న గింజలు అంతగా ఇష్టపడుతున్నారు. అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం వరకు వంటకాల్లో వీటిని చేర్చుకోవాలి. కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 5 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, విటమిన్లు B1, B3 పుష్కలంగా ఉంటాయి.
చియా గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచడంలో సహాయపడుతుంది. చియా గింజలు తగినంత పరిమాణంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడం లేదా బరువు నియంత్రణలో చాలా సహాయపడుతుంది. చియా సీడ్స్ కూడా కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. చియాసీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంతోపాటు ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అదేవిధంగా, టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఈ గింజల పాత్రను కనుగొన్నారు. గుండె ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనాలు.. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వీటిలో ఉంటాయి, ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు, వృద్ధాప్యం , క్యాన్సర్ వంటి పరిస్థితులను పెంచే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నియంత్రించడంలో కూడా వీటి వినియోగం సహాయపడుతుంది.
ఇందులోని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మేలు చేస్తాయి. చియా గింజలు నలుపు , తెలుపు రంగులో ఉంటాయి. చియా గింజలను నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాడండి. వీటిని పాయసం, ఫ్రూట్ జ్యూసులు, కేకులు మొదలైన వాటిలో వేసుకుని తినవచ్చు. చియా గింజలను కేకులు, బిస్కెట్లు మొదలైన వాటిలో కూడా ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే, మీరు వాటిని జెల్‌ల మాదిరిగా తయారు చేసుకోవచ్చు. గుడ్లకు బదులుగా బేకింగ్‌లో ఉపయోగించవచ్చు.