వెల్లుల్లి తినేముందు అది ఏ రంగులో ఉందొ చూసుకోండి, ఎందుకంటే..?
వెల్లుల్లిలో అలిసిన్ అనే ఓ ప్రత్యేక ఔషధ మూలకముంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలుతీసుకుంటే మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పలు అనారోగ్య సమస్యలు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే వెల్లుల్లిలో కూడా రంగులు ఉన్నాయి. అవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లి నీళ్ళు లేదా సూప్ తాగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
తెల్ల వెల్లుల్లి.. భారతీయ గృహిణులు ఎక్కువగా వినియోగించేది తెల్ల వెల్లుల్లి. ఎక్కువగా దుకాణాల్లోనూ ఇదే కనిపిస్తుంది. ఇవి సులభంగా పెరుగుతాయి. మసాలాలో వీటిని ఎక్కువగా వాడతారు. ఈ ఘాటైన వాసనకి దోమలు కూడా పారిపోతాయి. ఇవి సులభంగా పెరుగుతాయి. పర్పుల్ వెల్లుల్లి..ఊదా రంగులో కనిపిస్తాయి ఇవి. పైన తొక్క మాత్రమే ఊదా రంగులో ఉంటుంది కానీ లోపల పాయ మాత్రం తెల్లగానే ఉంటుంది. తెల్ల వెల్లుల్లి కంటే పరిమాణంలో కొద్దిగా పెద్దగా ఉంటాయి. సాధారణంగా మనం వాడే వాటి కంటే ఎక్కువ ఋచీకర్మాగా ఉంటాయి. కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఇవి కనిపిస్తాయి. హార్డ్ నెక్ గార్లిక్ వెరైటీ అని కూడా పిలుస్తారు. నల్ల వెల్లుల్లి..చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి.
కానీ ఇవి ప్రత్యేకమైన పదార్థం ఏమి కాదు. రుచి, ఔషధ ప్రయోజనాల కోసం కొన్ని శతాబ్దాలుగా ఆసియా వంటకాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది ఏదైనా చీజ్ ప్లేట్, బ్రుషెట్టా, చికెన్ డిష్ లేదా పిజ్జా టాపర్ కి దీన్ని ఉపయోగిస్తారు. దీనితో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండటానికి ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పింక్ వెల్లుల్లి.. పింక్ వెల్లుల్లిని గవితి లస్సాన్ అని కూడా పిలుస్తారు. ఒక్కో పాయలో 10 రెబ్బలు వరకు ఉంటాయి. పైకి గులాబీ రంగు కనిపించిన లోపల మాత్రం తెల్లగానే ఉంటాయి. ఇవి తీపి రుచి కలిగి ఉంటాయి.
వీటి వాస కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే దీన్ని వ్యసనపరుల వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. ఇవి జ్యూసీ గా సాధారణ వెల్లుల్లి కంటే తక్కువ జిగటగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఏ, బి, సి, రాగి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పింక్ వెల్లుల్లిని జాగ్రత్తగా భద్రపరిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకి నిల్వ చేసుకోవచ్చు. ఏవి ఆరోగ్యానికి మంచిది..రంగుతో సంబంధం లేకుండా అన్ని రకాల వెల్లుల్లి మంచిదే. ఆరోగ్యానికి, వంటలకి చక్కని రుచి ఇస్తాయి. అయితే వీటిలో పర్పుల్ వెల్లుల్లి తేలికపాటి రుచి కలిగి ఉంటుంది. ఇవి వంటకి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అందుకే వేరే వాటితో పోల్చలేరు.