అద్భుతమైన అవకాశం, రాత పరీక్ష లేకుండా SBIలో ఉద్యోగాలు. నెలకు రూ.70000 జీతం.
తాజాగా ఎస్‌బీఐ కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాసైతే చాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కనుక ఎస్‌బీఐలో జాబ్ కోసం కలలు కనే వారు.. ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోకూడదు అంటున్నారు నిపుణులు ఆ వివరాలు. అయితే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోెటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఖాళీగా ఉన్న 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు జూన్ 7 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూన్ 27. ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం 150 పోస్టులలో… 61 జనరల్ కేటగిరీకి,ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్ చేయబడ్డాయి. హైదరాబాద్, కోల్‌కతాలో పోస్టింగ్ ఉండవచ్చు. విద్యా అర్హత..ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
అంతేకాకుండా, IIBF నుండి ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేసి ఉండాలి. ఇది కాకుండా, షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్‌లో ఎగ్జిక్యూటివ్/సూపర్‌వైజర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం కూడా అవసరం. అంతేకాకుండా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావించే వారికి చివరి తేదీ జూన్ 27, 2024.
ఇక దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని భావించే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు, రుసుం చెల్లింపులు రెండూ జూన్ 07, 2024వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్, కోల్‌కతాలలో పని చేయవల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810వరకు జీతంగా చెల్లిస్తారు. మరి ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవాలి.