శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి పై వెలుగులోకి సంచలన విషయాలు.
శరత్ బాబు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వర్గాలు ఆయన హెల్త్ అప్‌డేట్ రిలీజ్ చేశారు. AIG హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు హెల్త్ కండీషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్పారు అక్కడి డాక్టర్స్. ప్రస్తుతం ఆయనకు మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నామని.. దయచేసి ఎవ్వరూ కూడా వదంతులు వ్యాప్తి చేయకూడదని తెలుపుతూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. శరత్ బాబు కుటుంబం నుండి లేదా అధికారిక AIG హాస్పిటల్స్ ప్రతినిధి నుండి వచ్చే వార్తలను మాత్రమే నమ్మండి అని పేర్కొన్నారు.
అయితే గత కొంత కాలం క్రితం ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పూర్తిగా విషమించడం తో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ లో కుటుంబ సభ్యులు ఆయనని చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కొద్దీ రోజుల క్రితమే శరత్ బాబు చనిపోయినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది. #RIPSarathBabu అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ కూడా అయ్యింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి శరత్ బాబు బ్రతికే ఉన్నాడని, ఆయనని మరో రూమ్ కి మార్చామని, చికిత్స కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. కానీ మరోపక్క సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే శరత్ బాబు చనిపోయి చాలా రోజులు అయ్యిందని, కుటుంబ సభ్యులు ఈ విషయాన్నీ గోప్యంగా ఉంచారని కూడా వార్తలు వినిపించాయి. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం తో ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి.
అయితే డాక్టర్లు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది,కానీ చికిత్స కి శరత్ బాబు బాగానే స్పందిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.హీరోగా క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో కలిపి సుమారుగా 250 కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు. 71 సంవత్సరాల వయస్సున్న శరత్ బాబు రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీర గా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత తెలుగు , హిందీ మరియు తమిళ బాషలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి లెజండరీ యాక్టర్ గా నిలిచాడు. ఆయన వెండితెర మీద చివరి సారిగా కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ .ఈ సినిమాలో ఆయన బార్ కౌన్సిల్ మెంబెర్ గా కనిపించాడు. ఆ తర్వాత వసంత ముల్లై అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ ఏడాది ప్రారంభం లోనే ఈ చిత్రం విడుదలైంది.