ఇండస్ట్రీలో విషాదం, క్యాన్సర్‌తో సమంత కన్నుమూత.
హాలీవుడ్ నటి సమంత.. పదేళ్లకే సినిమాల్లోకి వచ్చిన ఆమె 2005లో వచ్చిన ‘బిగ్ గర్ల్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మైఖేల్ నుట్సన్‌ను పెళ్లి చేసుకోగా ఆరు నెలలకే ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల క్రితమే ఆమె భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. అదే ఆమెకు చివరిదైందంటూ ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే హాలీవుడ్ నటి సమంత(28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
నటి మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. ‘తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు’ అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు.
సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది. 10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకుంది సమంత. 2005లో బిగ్ గర్ల్‌లో జోసెఫిన్ పాత్రను పోషించింది.
పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం.