ఎట్టకేలకు ప్రత్యేక పూజలు చేసి ఆ మొక్కు తీర్చుకున్న సమంత.
వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం నార్మల్ స్థితికి చేరుకున్న వెంటనే సమంత తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టింది. అయితే గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న లేడీ సూపర్ స్టార్ సమంతా, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ కి అటెండ్ అవుతోంది.
షూటింగ్ కోసం సెట్స్ కి అయితే సమంతా వెళ్తుంది కానీ తను ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ లో ఉందనే విషయం ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో రుద్రాక్ష మాలని పట్టుకోని కూర్చున్న సమంతా, తాజాగా దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించింది. ఈ ఆలయ మెట్ల మార్గం మొత్తం హారతి వెలిగిస్తూ సమంతా ప్రత్యేక పూజలు చేసింది. ఆరోగ్యం గురించే సమంతా పూజలు చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్యం కోసమో లేక ప్రశాంతత కోసమో, ఈ రెండు కాదు మెంటల్ స్ట్రెంగ్త్ కోసమో మరేదైనా కారణం కోసం సమంతా పూజలు చేసి ఉండొచ్చు. బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తిని బయట పడేందుకు తనతో తనే పోటీ పడుతున్న సమంతా, తన పెయిన్ ని హీల్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. ఈ ప్రయాణంలో తనని స్ట్రాంగ్ గా చేసే ఏ దారిలో అయినా సామ్ ప్రయాణించడంలో తప్పు లేదు.
తను ముందులా, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ గా ఈ ఫేజ్ నుంచి బయటకి రావాలని సమంతా ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంతా ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ శాకుంతలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫెబ్ 17న రిలీజ్ కావాల్సి ఉండగా ఏప్రిల్ 14కి వాయిదా పడింది. రాజ్ అండ్ డీకేతో మరోసారి వర్క్ చేస్తున్న సమంతా, సీటాడెల్ వెబ్ సీరీస్ చేస్తోంది.
ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా సమంతా, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే ప్యూర్ లవ్ స్టొరీ సినిమా ఒకటి కమిట్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవనుంది.
దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మెట్ల మార్గం మొత్తం హారతి వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి సమంత
— NTV Telugu (@NtvTeluguLive) February 14, 2023
Watch Here >> https://t.co/Y7nC54QU5p#NTVTelugu #SamanthaRuthPrabhu #Samantha #Tamilandu #palanitemple #myositis pic.twitter.com/vIHjiX43XH