నాగ చైతన్య మీద కోపంతో రెండో పెళ్ళికి రెడీ అయిన సమంత. వరుడు ఎవరంటే..?
రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంతకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట.ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట. అయితే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
నాగ చైతన్య మీద కోపంతో సమంత ఈ నిర్ణయం తీసుకుంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు సమంత రెండో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఓ సందర్భంలో రెండో పెళ్లి వార్తలపై సమంత స్పందిస్తూ .. మరో పెళ్లి చేసుకునే ఆసక్తి ఏమాత్రం తనకు లేదని.. పైగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎక్కువగా విడిపోతున్నారు అంటూ కామెంట్స్ చేసింది.
కాబట్టి సమంత రెండో వివాహం మీద వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. ఇక ఖుషి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పలు దేశాల్లో సమంత సంచరించింది. కొద్ది రోజులగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది. ఇక త్వరలో సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ కి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు షేర్ చేసింది.
ఇది హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో వస్తుంది. సిటాడెల్ కోసం సమంత కఠిన యాక్షన్ స్టంట్స్ చేశారు. సమంత యాక్షన్ అవతార్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. నెక్స్ట్ రామ్ చరణ్ కి జంటగా దర్శకుడు బుచ్చిబాబు మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.