షూటింగ్ సెట్‌లో హఠాత్తుగా పడిపోయిన సమంత, అసలు ఏం జరిగిందో తెలుసా.?
మయోసైటిస్ చికిత్స తీసుకునేందుకు సినిమాలకు దూరం ప్రకటించిన తర్వాత ఏడాదిన్నరకు ఆమె నుంచి వచ్చిన సిరీస్ ఇది. వరుణ్ ధావన్ కథానాయకుడు కాగా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్ లో ప్రియాంకచోప్రా పోషించిన పాత్రను సమంత పోషించింది. యాక్షన్ సన్నివేశాల్లో సమంత నటన చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే సమంత ఈ సిరీస్ లో మరోసారి బోల్డ్ గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో మూవీ టీమ్ బిజీగా ఉంది.
కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సామ్ గురించి.. సిటాడెల్ సిరీస్ షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కాగా సినిమా షూటింగ్ లో సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. సామ్ పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని వరుణ్ తెలిపాడు. షూటింగ్ లో భాగంగా రెండు గంటల పాటు నటిస్తుండగా సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. ఇది చూసిన తనకు కంగారు వచ్చిందని.. వెంటనే ఆమెను లేపి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడట.
అయితే కొంత సమయం రెస్ట్ తీసుకున్న తర్వాత సామ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. సామ్ అలా పడిపోగానే అందరం ఆందోళనకు గురయ్యాం.. కానీ కోలుకున్న తర్వాత సామ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంది అని తెలిపాడు వరుణ్. సమంత 2022లో తనకు మైయోసైటిస్ ఉందని ప్రకటించింది. సినిమాలకు దూరమై థెరపీపై దృష్టి పెట్టింది సామ్. చికిత్స సమయంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. కాగా ఇప్పుడు ట్రీట్‌మెంట్ తర్వాత సమంత మళ్లీ నటించడం మొదలుపెట్టింది.