News

సమంత పరిస్థితి విషమం, మీకు అసలు నిజం తెలిస్తే..?

సమంత అనారోగ్యం గురించి ఫ్యాన్స్‌కు వెల్లడించిన సందర్భంలో ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘‘గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది.

ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. అయితే ఇటీవలు యశోద సినిమాతో సక్సెస్‌ అందుకుంది హీరోయిన్‌ సమంత. మయోసైటిస్‌ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది.

అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్‌ కొట్టిపారేసింది. సమంత దక్షిణ కొరియాకు వెళ్లడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఎలాంటి సమాచారం లేకుండా ఒకరి ఆరోగ్యం గురించి ఇలా ఏది పడితే అది ఎలా రాస్తారని సామ్‌ టీమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని స్పష్టం చేసింది. అనవసరంగా తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టించవద్దని కోరింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker