నాగచైతన్యతో విడాకులకు కారణం ఆమేనా..? ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన సమంత.
నాగచైతన్య – సమంత ఒకప్పుడు ఈ కపుల్‌కు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ ఈ జంట మాత్రం కలిసి లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు పరస్పర అంగీకారంతో కొన్నేళ్ల క్రితం ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే సమంత పెళ్లయ్యాక కూడా బోల్డ్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేని నాగ చైతన్య విడాకులు ఇచ్చాడనేది ఒక వెర్షన్. అలాగే ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదు. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుంది, అంటూ కథనాలు వెలువడ్డాయి.
నిరాధార కథనాల మీద సమంత ఫైర్ అయ్యారు. ఆమె లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో సదరు ఛానల్స్ కంటెంట్ తొలగించడం జరిగింది. సమంత డిప్రెషన్ అనుభవించారు. విడాకుల ఒత్తిడి నుండి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. మెల్లగా ఆ బాధ నుండి కోలుకుని వర్క్ లో బిజీ అయ్యారు.
విడాకుల అనంతరం సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. సిటాడెల్ టైటిల్ వెబ్ సిరీస్ చేయగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. కాగా సమంత విడాకుల నిర్ణయం వెనుక ఒక అమ్మాయి ఉందనే సందేహాలు తాజాగా మొదలయ్యాయి. సమంత సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం అయ్యింది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్ తో దిగిన ఫోటో సమంత షేర్ చేసింది. సదరు ఫోటోకి ఆసక్తికర కామెంట్ జోడించింది.
నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే… అది మేఘనే, అని సమంత కామెంట్ చేసింది. మేఘన తన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన అనుమతి తోనే సమంత విడాకులు తీసుకోవాలి డిసైడై ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.