Health

ఉప్పు ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

ఉప్పు రోజుకు కావాల్సింది 5–10 గ్రాములు మాత్రమే గాని ఎక్కువ పని ఉండదు. ఉప్పుని బయటకు పంపడానికి కిడ్నీలు 150 లీటర్ల రక్తాన్ని వడబోస్తాయంటే ఏ స్థాయిలో కిడ్నీలు కష్టపడతాయో చూడండి. అయితే.. చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు. రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు. మన శరీరానికి అవసరమైన ఉప్పును వాడకపోవడం వల్ల.. ఏ ఉప్పు వాడాలో తెలియకపోవడం వల్ల.. ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

నిజానికి.. మన శరీరానికి ఉప్పు ఎంతో అవసరం. కానీ.. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఉప్పులో సోడియం, క్లోరైడ్ ఉంటాయి. వీటి వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. కణాల్లో, రక్తంలో ఉండే నీటి శాతాన్ని ఉప్పు నియంత్రిస్తుంది. కాకపోతే.. రోజూ 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును రోజూ తీసుకుంటే.. శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. బీపీ పెరుగుతుంది.

ఒకవేళ ఉప్పును ఎక్కువగా కొన్నేళ్ల పాటు తీసుకుంటే.. జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీతో పాటు.. గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలాగని.. ఉప్పును పూర్తిగా మానేసినా కూడా సమస్యే. అందుకే.. రోజుకు కనీసం 6 గ్రాముల ఉప్పును మీ ఆహారంలో భాగం చేసుకోండి. సాధారణంగా.. ఎక్కువ మంది మార్కెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ ను వాడుతుంటారు.

కానీ.. అది ఆర్టిఫిషియల్ గా అయోడిన్ కలిపిన ఉప్పు. అలాగే.. అది ప్రాసెస్ చేసిన ఉప్పు. ఆ ఉప్పు తినడం వల్ల ఉన్న రోగాలు పోయి.. వేరే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఎక్కువ శాతం.. సముద్రపు ఉప్పు, గళ్ల ఉప్పు, రాళ్ల ఉప్పును వాడటం మంచిది. వాటిలో సహజసిద్ధంగా అయోడిన్ ఉంటుంది. అలాగే సైంధవ లవణాన్ని కూడా కూరల్లో వేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ.. అయోడైజ్డ్ ఉప్పు పేరుతో అమ్మేవాటిని తినడం వల్ల లేనిపోని సమస్యలను అయితే కొని తెచ్చుకున్నట్టే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker