కూరలో ఉప్పు ఎక్కువ వేసుకొని తింటున్నారా..? ఎంత ప్రమాదమంటే..?
కూరలో ఉప్పు తక్కువ అయితే వేసుకోగలం. అదే ఎక్కువైతే కూర టేస్ట్ మొత్తం పోతుంది. ఇక ఆ కర్రీని తినలేం. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూరలో ఎక్కువైన కారం, ఉప్పును తగ్గించేయొచ్చు. అయితే అధిక ఉప్పు తినడం వల్ల మన గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు దెబ్బతింటాయని మనకు తెలుసు. అయితే తమ అధ్యయనం ద్వారా ఆహారంలో అధిక ఉప్పు మన మెదడు ఒత్తిడిని నిర్వహించే విధానాన్ని కూడా మారుస్తుందని వెల్లడైంది.” అని మాథ్యూ బెయిలీ పేర్కొన్నారు.
ఒకరోజులో ఒక వ్యక్తి ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలో ఆయన సూచించారు. పెద్దలు రోజువారీగా తీసుకునే ఉప్పు మోతాదు ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. ఒకరోజులో తొమ్మిది గ్రాములకు మించి ఉప్పు తింటే ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, గుండెపోటులు, స్ట్రోకులు, వాస్కులర్ డిమెన్షియా ప్రమాదాలను పెంచుతుంది అని అధ్యయనంలో పేర్కొన్నారు.
అయితే చాలా మందికి అంతకు మించిన ఉప్పు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు తప్పదని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నిపుణులు ఎలుకలకు సాధారణ మానవ ఆహారాన్ని అందించారు. కొన్నిసార్లు ఉప్పు లేకుండా, మరికొన్ని సార్లు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినేలా చేశారు.
ఉప్పు ఎక్కువైనపుడు ఎలుకలో ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరగడమే కాకుండా, పర్యావరణ ప్రతికూలతలతో ఏర్పడిన ప్రతిస్పందనలు మిగతా ఎలుకలతో పోలిస్తే రెట్టింపుగా ఉందని నిపుణులు గుర్తించారు. ఈ ప్రకారంగా అధిక ఉప్పు తీసుకోవడం వలన ఆందోళన, దూకుడు స్వభావానికి దారితీస్తుందని తెలిపారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు.