మటన్ కొంటున్నారా..? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.
అసలు అది, ఇది అని తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఆహారాలను కల్తీ చేస్తున్నారు. దీంతో ఏది కల్తీ కాదో గుర్తించడం మనకు చాలా కష్టతరమవుతోంది. అయితే కల్తీ విషయానికి వస్తే.. మనం తినే నాన్‌వెజ్ ఐటమ్ అయిన మటన్‌లో అది ఇంకా ఎక్కువ జరుగుతుంది.
అంటే.. కుళ్లిపోయిన మాంసం అమ్మడమో, బాగా కొవ్వు ఉన్న కూర అమ్మడమో .. లేదా ఎప్పుడో కట్ చేసిన మటన్‌ను అమ్మడమో చేస్తుంటారు. దీంతో మనం మోసపోవాల్సి వస్తుంది. అయితే లేత మటన్ లేత ఎరుపు రంగులో ఉంటుంది. అది చాలా మృదువుగా ఉంటుంది. ముదురు మటన్ డార్క్ రెడ్‌లో ఉంటుంది. ఆ మటన్ చాలా కఠినంగా అనిపిస్తుంది.
లేత మటన్ మీద కొవ్వు తెల్లగా, లేత పసుపు రంగులో ఉంటుంది. ముదురు మటన్ మీద కొవ్వు పసుపు లేదా బూడిద రంగులో కనిపిస్తుంది. ఇక లేత మటన్ నుంచి కొవ్వును సులభంగా వేరు చేయవచ్చు. ముదురు మటన్ నుంచి కొవ్వును సులభంగా వేరు చేయలేము. అది చాలా గట్టిగా ఉంటుంది.
లేత మటన్‌పై వేలితో నొక్కితే సొట్టలు ఏర్పడుతాయి. వెంటనే అవి సమం అవుతాయి. ముదురు మటన్ ఇలా అవదు. లేత మటన్ అయితే పక్కటెముకలు చిన్నగా ఉంటాయి. ముదురు మటన్ అయితే ఎముకలు పెద్దగా ఉంటాయి. తోక చిన్నగా ఉంటే లేత మటన్ అన్నట్లు లెక్క. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని తెలుసుకోవాలి.