పబ్‌లో హీరోయిన్ సాయిపల్లవి మాస్ డ్యాన్స్ చూసారా..? వీడియో వైరల్
ఊపున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా సాయిపల్లవి ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేశారు. మూవీ టీమ్ మెంబర్స్ అరుస్తూ ఎంకరేజ్ చేయగా.. ఆమె చాలా గ్రేస్‍తో, ఉత్సాహంగా చిందేశారు. సంతోషంగా నవ్వుతూ.. కేకలు వేస్తూ స్టెప్‍లు వేశారు. అయితే మలయాళ సినిమాలతో స్టార్ట్ అయిన సాయి పల్లవి యాక్టింగ్ కెరీర్.. ఇప్పుడు బాలీవుడ్ కి కూడా చేరింది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి ‘ఏక్ దిన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జపాన్ లో జరుగుతుంది.
అక్కడి షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ అంతా కలిసి అక్కడి పబ్ లో ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు హిందీ సూపర్ హిట్ సాంగ్స్ కి మూవీ యూనిట్ అంతా కలిసి డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈక్రమంలోనే సాయి పల్లవి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వేసిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
Queen Sai Pallavi Dance at #EkDin japan schedule wraps up party 🥹♥️#SaiPallavi @Sai_Pallavi92 #Japan pic.twitter.com/j10iQTYQqd
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 8, 2024