News

పొలంలో రైతులా పంటలు పండిస్తున్న రోబో..! ఎలా పండిస్తుందో చుడండి. వైరల్ వీడియో.

ఈ రోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి, పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చైనాకు సంబంధించినదిగా తెలుస్తోంది. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయకూడని పనులు కూడా చేసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక రోబోకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోబో అచ్చం రైతుల మారిపోతే ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. ఇప్పటికే మనం ఇలాంటి రోబోలో గతంలో చూసాం. రోబోలు డెలివరీ బాయ్స్ లాగా మారి డెలివరీ చేస్తున్నట్లు, హోటల్స్ లో కస్టమర్లకు వారి ఫుడ్ సప్లై చేస్తున్నట్లు ఇలా చాలా వీడియోలు చూసాం. ఇక ఇప్పుడు అచ్చం రైతులాగా రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఆ రోబోట్ పొలంలో ఏర్లు నాటడం, పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేయగలిగిన ప్రతి పనిని కూడా చేస్తోంది. ఈ వీడియో Interesting STEM అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే ఏకంగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసి నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది రియల్ రోబోట్ కాదు. ఈ వీడియోని ఎడిట్ చేసారని స్పష్టంగా తెలుస్తుంది.

కానీ మనిషి తలుచుకుంటే ఇలాంటి రోబోని తయారు చేయొచ్చని కొంతమంది నెటిజనులు కామెంట్స్ చేస్తునారు. ఇలాంటి AI రోబోలు వుంటే రైతులకు చాలా మేలు కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి ఫార్మర్ రోబోట్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker