రోడ్డు పక్కన కొబ్బరి పువ్వు కనిపిస్తే అస్సలు వదలకండి, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు అయితే…?
కొమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు ఇలా కొబ్బరి చెట్టు నుంచి వచ్చేవన్నీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఒక్కో సారి కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది. ఇలా పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కొందరైతే ఆ పువ్వును తింటారు కూడా. కానీ, కొందరు మాత్రం కొబ్బరి కాయలో వచ్చే పువ్వును తీసి పాడేస్తుంటారు. వాస్తవానికి కొబ్బరి కాయలోని నీళ్ళు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది.
అయితే కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులోనే ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కొబ్బరి పువ్వును ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ కొబ్బరి పువ్వు సూపర్‌గా సహాయపడుతుంది. కాబట్టి, మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని మిస్ చేసుకోకుండా హ్యాపీగా తినొచ్చు.
అంతేకాదు కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అయితే చాలా కొబ్బరి చెట్లను పెంచుతూ ఉంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కొబ్బరిచెట్లు కనిపిస్తాయి. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరికాయలే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడును కొన్ని ఆయుర్వేద మెడిసిన్ లో వాడుతారు. అయితే కొబ్బరికాయలు మార్కెట్లోకి తీచ్చిన తరువాతా కొన్నింటిలో నీరు అయిపోయి పువ్వుగా మారుతుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇది బయటపడుతుంది. కానీ దీనిని తీసేస్తారు. అయితే ఇందులో అనేక ప్రయోజనాలున్నాయి.
ఇటీవల కాలంలో రోడ్డు పక్కన ఇప్పుడు కొబ్బరి పువ్వులను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. కానీ చాలా మంది వీటిపై అవగాహన లేదు. దీంతో వీటిని తినడం వల్ల ఏమవుతుందోనన్న ఆందోలన ఉంది. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కొబ్బరి పువ్వును నిరభ్యంతరంగా తినొచ్చు. ఇది తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల అలసట తగ్గుతుంది. బరువును కూడా తగ్గించుకుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరిపువ్వు దివ్యౌషధంలా పనిచేస్తుంది. డైట్ మెయింటేన్ చేసేవాళ్లు దీనిని కూడా చేర్చుకోవచ్చు. కొబ్బరిపువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ ఈ పదార్థం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగే సమస్య అస్సలు ఉండదు.