News

ఇండస్ట్రీలో విషాదం. తెల్లవారుజామున గుండెపోటుతో సీనియర్ నటుడు కన్నుమూత.

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. అయితే ఇటీవల గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.

తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన సహోద్యోగి, ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ ఈ విషాద వార్తను మీడియాకు తెలియజేశాడు. రితురాజ్ సింగ్ తనకు మంచి స్నేహితుడని, ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రితు రాజ్ కు గుండెపోటు వచ్చిందని మీడియాకు వెల్లడించాడు. రితురాజ్ ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, దానికి చికిత్స పొందుతున్నారని సీఐఎన్టీఏఏ చీఫ్ తెలిపారు.

నిర్మాత సందీప్ సిక్చంద్ రితురాజ్ సింగ్ మరణంపై ఒక ప్రకటనలో ఇలా రియాక్ట్ అయ్యారు. “ఈ వార్త విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఉదయాన్నే ఎవరో నా వాట్సప్ గ్రూప్ లో ఈ వార్తను పోస్ట్ చేశారు. అప్పటి నుండి నేను షాక్ లో ఉన్నాను. ‘కహానీ ఘర్ ఘర్ కీ’లో రీతూతో కలిసి నటించాను. ఈ షోలో నాకు సాదర స్వాగతం పలికిన అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. అద్భుతమైన నటుడు. కానీ ఒక నటుడి కంటే, అతను నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తులలో ఒకడు. ఆ వార్త నన్ను చాలా బాధించింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భార్యాపిల్లలు ధైర్యంగా ఉండాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. రీతురాజ్ కే సింగ్ ఇటీవల రూపాలీ గంగూలీ టీవీ సీరియల్ ‘అనుపమ’లో యశ్పాల్ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా ఈ నటుడు టీవీ, చలనచిత్ర పరిశ్రమ రెండింటిలోనూ గొప్ప కెరీర్ ను కొనసాగించాడు. ‘బనేగీ అప్నీ బాత్’ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో సింగ్ నటించారు. మాధవన్, దివంగత నటుడు ఇర్ఫాన్, సురేఖ సిక్రీ తదితరులతో కలిసి నటించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker