అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో రిహానా సందడి, ఆమెకి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా..?
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రివెడ్డింగ్ వేడుకలు.. ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకలో అమెరికా నుంచి వచ్చిన పాప్ సింగర్ రిహానా తనదైన శైలిలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. తన పాటలతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. రిలయన్స్ గ్రీన్స్‌లో ప్రదర్శన తర్వాత.. తిరిగి వెళ్లిపోయారు రిహానా. ఈ సందర్భంగా జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో పపరాజీలతో ముచ్చటించారు.
అయితే టాలీవుడ్ నుంచి రాంచరణ్, ఉపాసన దంపతులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తన కొడుకు పెళ్లివేడుక చిరకాలం గుర్తుండిపోయేలా, ప్రపంచం మొత్తం చెప్పుకునేలా ముఖేష్ అంబానీ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుక కోసం హాలీవుడ్ టాప్ పాప్ సింగర్ రిహన్నాని పిలిపించారు. రిహన్నా ఎంత కాస్ట్లీ సింగల్ సింగర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పెర్ఫామెన్స్ కోసం రిహన్నాని పిలిపించారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ పెర్ఫామెన్స్ కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమెకి ఏకంగా 50 కోట్లు ఇస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇండియాలో కొందరు స్టార్ హీరోలు ఒక చిత్రం కోసం ఏడాది మొత్తం కష్టపడితే అంత రెమ్యునరేషన్ దక్కుతుంది.
కానీ ఈమె మాత్రం ఒక్క స్టేజి పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు అంత మొత్తం సమర్పించు కుంటున్నారు అని అంటున్నారు. ఆమె గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో పెర్ఫామెన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేదానికి ఇదే ఉదాహరణ అని మరికొందరు అంటున్నారు.
Rihanna is worth 1 Billion . And she is made a wedding function singer by the ambanis ! Wealth can do literally anything ! pic.twitter.com/tlKg5R3p5j
— Prashanth Rangaswamy (@itisprashanth) March 2, 2024