రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేప్పుడు రేవంత్ భార్య అన్విత ప్రెగ్నెంట్‌గా ఉన్నారనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోనే రేవంత్ భార్య సీమంతం వేడుక కూడా చూసాం. అన్విత సీమంతం వేడుక జరిగిందని.. ఆ మధుర క్షణాలను బిగ్ బాస్ మీకు చూపించాలని అనుకుంటున్నట్లు చెబుతూ సీమంతం వీడియోను టీవీలో చూపించాడు బిగ్ బాస్.
అయితే బిగ్బాస్ తెలుగు 6వ సీజన్ తోని దశకు చేరుకుంటుంది. ఫైనల్స్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఎవరు కూడా తగ్గకుండా గేమ్ ప్లాన్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా జరిగే ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టి ఒకరిని డైరెక్ట్ గా ఫినాలేకు పంపనున్నాడు బిగ్ బాస్.
ఇదిలా ఉంటే బిగ్బాస్ తెలుగు 6 సీజన్ లోకి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగాడు సింగర్ రేవంత్. తాజాగా రేవంత్ సతీమణి అన్విత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు తెల్లవారుజామున అన్విత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రేవంత్ సన్నిహితులు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్ కు ఈ విషయాన్ని చెప్పి బిగ్ బాస్ హ్యాపీ చేస్తాడేమో చూడాలి.