News

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ సినిమాను మించిన ట్విస్టులు, చివరి ట్విస్ట్ ఏంటో తెలిస్తే..?

రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ లైఫ్ పెద్దగా ఎవరికీ తెలియదు. రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే లవ్ స్టోరీ నడిపారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. సినిమాను మించిన ట్విస్టులతో చివరకు పెద్దలను ఒప్పించి తన ప్రేయసి గీతా రెడ్డిని ఆయన వివాహం చేసకున్నారు. అయితే ఇంటర్‌ చదివే రోజుల్లో ఓసారి నాగార్జునసాగర్‌ పర్యటనకు వెళ్లారు రేవంత్ రెడ్డి.

అక్కడ బోటులో గీతారెడ్డిని తొలిసారి చూశారు. ఆమె కుటుంబ వివరాలు తెలుసుకునే క్రమంలో ఇద్దరి పరిచయం మొదలైంది. ఇది స్నేహంగా మారింది. అచ్చం గోదావరి సినిమా ఇలానే ఉంటుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి‌ స్వయంగా గ్రీటింగ్‌కార్డులు తయారుచేసి మరీ.. గీతారెడ్డికి పంపించేవారట. అలా క్రమంగా వారి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని రోజుల తర్వాత మొదట రేవంత్ రెడ్డే తన ప్రేమను గీతా రెడ్డికి తెలియజేశారు.

నిన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నట్చి.. గీతా రెడ్డి కూడా ఆయన ప్రేమను అంగీకరించారు. కొన్నాళ్ల తర్వాత వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. గీతారెడ్డి ప్రేమను అంగీకరించని ఆమె కుటుంబ సభ్యులు.. ఆమెను కొన్నాళ్లు దూరంగా పంపారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి నేరుగా గీతా రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

వారిని ఒప్పించి.. తమ ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఇరు కుటుంబాల అంగీకారంతో 1992లో రేవంత్ రెడ్డి, గీతా రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఒక్కగానొక్క కూతురుంది. ఆమె పేరు నైమిష. రేవంత్ రెడ్డి కూతురు నైమిషకు 2015లో వివాహం జరిగింది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి.. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడుపుతారు. మనవడితో ఆడుకుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker