వీటిని తరచూ తింటుంటే సహజ విధానంలోనే షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
పాత రోజులలో ఈ రోజుల్లో ఉన్నట్లుగా 24×7 ఆహారం అందుబాటులో ఉండేది కాదు. ప్రజలు అడవుల్లో ఆహారం కోసం వెదికేవారు, కొన్నిసార్లు వారు కొద్ది రోజులకు ఒకసారి ఆహారాన్ని పొందగలిగేవారు, ఈ కఠినమైన సమయాల్లో, కొవ్వును గ్లూకోజ్‌గా మార్చడం ద్వారా శరీరం నిల్వ చేసిన కొవ్వు నుండి శక్తిని పొందవలసి ఉంటుంది. అయితే సహజంగా మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని మన వంటగదిలోని ఉంటాయి. అవి ఎన్నో అద్భుతాలను చేస్తాయి.
ముఖ్యంగా వంట గదిలో ఉండే.. జీలకర్ర, చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ కారణాలతో వీటిని వాడితే.. ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలన్నింటిలో ఉండే ఫైబర్ మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది, అంతేకాదు చక్కెర శోషణను, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఎంతో ఉపయోగకరంగా ఉండే విత్తనాల కోసం మనం ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు. ఈ విత్తనాలు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో ఉంటాయి.
మీ ఆహారంలో ఈ విత్తనాలను చేర్చుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. జీలకర్ర :- జీలకర్ర విషయానికి వస్తే.. ఇది మీ రక్తంలో యూరియా స్థాయిని తగ్గిస్తుంది అంతేకాదు మధుమేహం లక్షణాలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఇంకా చక్కెర స్థాయిలను తగ్గించాలనుకునే వారు తమ ఆహారంలో జీలకర్రను విరివిగా చేర్చుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పైన పేర్కొన్న రెండూ మన శరీరంలో పెరుగుతాయని గుర్తుంచుకోండి.
మెంతులు :- మెంతికూరను గోరువెచ్చని నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే మెంతికూరకు మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగా తగ్గించే శక్తి ఉంది. గుమ్మడి గింజలు:- గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
గుమ్మడి గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు తమ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు :- పొద్దుతిరుగుడు విత్తనాలలో అధిక మొత్తంలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ గింజల్లో ఫైటోస్టెరాల్, గ్లైకోసైడ్స్, కెఫిన్ మరియు కునిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటాయి.