మధుమేహులకు ఈ రెడ్ రైస్ అమృతంతో సమానం. ఎలాగంటే..?
ఎర్ర బియ్యానికి పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఆరోగ్య కారణాల రీత్యా ఎర్ర అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. బ్రౌన్ రైస్ తో పోలిస్తే దీని రుచి కూడా బావుంటుంది. వీటిలో లావు బియ్యం, సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి కనుక బిర్యానీ వంటివి కూడా వండుకోవచ్చు. అయితే పాలిష్ చేయబడిన రైస్ వెరైటీస్ కంటే ఈ రెడ్ రైస్ లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ.రెడ్ రైస్ ను కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది. రెడ్ రైస్ ను వండుకోవడం సులభమే. వైట్ రైస్ ను ఎలా వండుతామో అలాగే దీన్ని కూడాఅలాగే వండుకోవాలి.
ఈ రెడ్ రైస్ ను కూరలతో, సాంబార్ తో మీరురోజువారీగా తినే వెరైటీస్ తోకలిపి తినవచ్చు. కొన్నిసార్లు పోహా అలాగే పులావ్ వంటి వంటలలో లోకూడా రెడ్ రైస్ ను వాడతారు. బరువు తగ్గేందుకు డైట్ లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో తెలీక తికమకపడేవారు రెడ్ రైస్ ను తినడం మొదలు పెట్టండి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ సున్నా. కాబట్టి, దీన్ని తినడం వలన బరువు పెరుగుతారేమోనన్న భయం అవసరం లేదు. రెడ్ రైస్ తో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
దాంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. రెడ్ రైస్ లో ఉండే సెలీనియం అనేది వివిధ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.రెడ్ రైస్ ను మీరు ఆహారం లో భాగంగా చేసుకుంటే ఇక బోన్ హెల్త్ గురించి దిగులు పడనవసరం లేదు. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన ఇది సాధ్యమవుతుంది.జాయింట్ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు కూడా రెడ్ రైస్ ఉపయోగపడుతుంది. రెడ్ రైస్ లో ఐరన్ కంటెంట్ ఉండడం వలన, రోజూ ఈ రైస్ ను తింటే ఆక్సీజన్ ను శరీరం గ్రహిస్తుంది. మీరు మరింత ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. అలసట దరిచేరదు. రెడ్ రైస్ లో విటమిన్ అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ను పెంచుతాయి. దాంతో, చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం జరుపుతాయి.
కాబట్టి, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య బారిన పడే ప్రమాదం తక్కువేనని చెప్పుకోవచ్చు.ఈ రైస్ లో మెగ్నీషియం లభిస్తుంది. ఇది బ్రీతింగ్ ప్యాటర్న్ ను అదుపు చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఆస్త్మా అటాక్స్ ను తగ్గిస్తుంది. రెడ్ రైస్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్స్ కు ఈ రైస్ ఎంతగానో ప్రయోజనకరం.రెడ్ రైస్ లోపీచు పదార్ధం ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణప్రక్రియకు సహాయం చేస్తుంది. బవుల్ మూవ్మెంట్ ను సులభతరం చేస్తుంది. అలాగే, ఇందులో ఉండే పీచు పదార్థం మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి, జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు.అయితే ఈ విషయంలో మీ డాక్టర్ సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.