ఈ రెడ్ రైస్ తరచూ తింటుంటే లైంగిక సమస్యలు జీవితంలో రావు.
తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా వండిపెడతారు. పీచు, ఇనుము అధికంగా ఉండే ఈ బియ్యంలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం రెడ్ రైస్. ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్ బి1, బి2… వంటి విటమిన్లతోబాటు ఐరన్, జింక్, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్… వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా పనిచేస్తాయివి. అయితే ఎర్ర బియ్యం పొట్టు పొరలో ఆంథోసైనిన్ వర్ణద్రవ్యాలు పేరుకుపోవడం వల్ల బియ్యం సాధారణంగా ఎరుపు రంగులోకి మారుతాయి.
వీటిలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. రెడ్ రైస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే? మహిళల లైంగిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.. ఆయుర్వేదంలో ఎర్ర బియ్యం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దక్షిణాసియా దేశాలలో బాలికలకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎర్ర బియ్యాన్ని తినిపిస్తారు.
దీనిలో ఉండే ఐరన్, ఎసెన్షియల్ ప్రోటీన్ రక్తహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జనేంద్రియాలను బలోపేతం చేస్తుంది. పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన అన్ని ప్రధాన అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఎర్ర బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 గా ఉంటుంది. మధుమేహులు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కడుపును కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
రెడ్ రైస్ ను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది శ్వాస విధానాలను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని ప్రతి కణంలో ఆక్సిజన్ వినియోగాన్ని, ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.. దీనిలో కాల్షియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, వివిధ ఎముక సంబంధిత రుగ్మతలను నివారించడానికి సహాయపడతాయి. తేలికగా జీర్ణం అవుతాయి.. జర్నల్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రకారం.. ఎర్ర బియ్యంలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. ఫైబర్ ప్రేగు కదలికకు సహాయపడుతుంది.
ఇది విరేచనాలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి.. రెడ్ రైస్ ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఈ బియ్యంలో కొవ్వు మొత్తమే ఉండదు. కాబట్టి దీన్ని లంచ్ లేదా డిన్నర్ లో కూడా తినొచ్చు. ఇతర రకాల బియ్యం మాదిరిగా కాకుండా దీనిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ లో ప్రచురితమైన ఒక పరిశోధన కథనం ప్రకారం.. తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యాన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బియ్యంలో తృణధాన్యాలు ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీంతో గుండు ఆరోగ్యంగా ఉంటుంది.