షుగర్ వ్యాధి ఉన్నవారికీ ఈ ఎర్రబియ్యం అమృతంతో సమానం.
అన్నం ఎక్కువగా తింటే… బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే రెడ్ రైస్ విషయంలో అలా జరగదు. చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం… తినేటప్పుడు బాదం, జీడిపప్పులా… కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన (తెల్ల బియ్యం)తో పోల్చితే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తాషలీ, థాయ్ రెడ్ కార్గో రైస్, బూటాన్ రెడ్ రైస్, ఫ్రాన్స్‌లో పండే కామార్గ్ రెడ్ రైస్, కేరళలో పండే మట్టా రైస్. ఇవన్నీ రెడ్ రైస్‌లో రకాలు.
అయితే ఈ బియ్యం కిలో ధర రూ.120 దాకా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎర్ర బియ్యానికి పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఆరోగ్య కారణాల రీత్యా ఎర్ర అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. బ్రౌన్ రైస్ తో పోలిస్తే దీని రుచి కూడా బావుంటుంది. వీటిలో లావు బియ్యం, సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి కనుక బిర్యానీ వంటివి కూడా వండుకోవచ్చు.
ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా తినడం ప్రారంభించేస్తారు. ఒక కప్పు ఎర్ర అన్నం తింటే 216 కెలోరీలు లభిస్తాయి. ఎర్ర బియ్యానికి ఆ రంగు యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల వస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఈ అన్నాన్ని తింటే త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. తద్వారా బరువు తగ్గే అవకాశం ఎక్కువ. ఇది రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ అందుతుంది.
ఆక్సిజన్ సమస్థాయిలో శరీరానికి చేరి అలసట త్వరగా కలుగదు. ఇందులో ఉండే విటమిన్ బి6 ఎర్రరక్తకణాల సంఖ్య పెరిగేందుకు సహకరిస్తుంది. ఈ ఎర్రబియ్యంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు, మోకాలి నొప్పులు తగ్గుతాయి. కంటిచూపును మెరుగు పడడం, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడం, రక్తపోటును తగ్గించడం వంటి మంచి గుణాలు ఎర్రబియ్యంలో ఉన్నాయి. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా దీనికి ఎక్కువ.