Health

ఎర్ర ఉల్లిపాయ‌ని ఇలా చేసి వాడితే థైరాయిడ్ స‌మ‌స్య‌ త‌క్ష‌ణ‌మే తగ్గిపోతుంది.

థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. అయితే ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. ఇవి లేకుండా మ‌నం ఏ కూరా వండ‌లేం. ఉల్లిపాయ‌ల‌ను మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల పోష‌కాల‌తోపాటు చ‌క్క‌ని ఆరోగ్యం కూడా మ‌న సొంత‌మ‌వుతుంది.

అయితే థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ప్ర‌ధానంగా ఎర్ర ఉల్లిపాయ‌లతో ఓ సుల‌భ‌మైన చిట్కాను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం పొందేందుకు వీలు క‌లుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎర్ర ఉల్లిపాయ‌ల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, పొటాషియం, మాంగ‌నీస్‌, విట‌మిన్ సి త‌దిత‌ర పోష‌క ప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంతోపాటు చ‌ర్మాన్ని శుభ్ర ప‌రుస్తాయి. ఎర్ర ఉల్లిపాయ‌ల‌ను ఎలా కావాలంటే అలా మ‌నం తిన‌వచ్చు. కొంద‌రు వీటిని ప‌చ్చిగా తింటే మ‌రికొందరు ఉడికించిన‌వి ఇష్ట‌ప‌డ‌తారు.

అయితే ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తింటేనే వాటి నుంచి పూర్తి స్థాయిలో పోష‌కాలు మ‌న‌కు అందుతాయి. ఇప్పుడిక అస‌లు విష‌యానికి వ‌స్తే థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఎర్ర ఉల్లిపాయ‌ల‌తో ప‌రిష్క‌రించేందుకు ఓ వైద్యుడు సరికొత్త చిట్కాను ప‌రిచ‌యం చేశాడు. అదేమిటంటే ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని దాన్ని స‌గానికి క‌ట్ చేయాలి. దీంతో అందులో అద‌నంగా ఉండే నీరు, ఇత‌ర జ్యూస్ వంటి ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి.

అయితే ఈ చిట్కాను రాత్రి పూట అనుసరించాలి. క‌ట్ చేసిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను థైరాయిడ్ గ్రంథులు ఉన్న ప్ర‌దేశంపై సున్నితంగా మ‌సాజ్ చేస్తూ రాయాలి. దీంతో వాటిలో ఉండే ఔష‌ధ ప‌దార్థాల‌ను థైరాయిడ్ గ్రంథులు పీల్చుకుంటాయి. రాత్రంతా గొంతును క‌డ‌గ‌కుండా అలాగే ఉంచాలి. దీంతో ఉల్లిపాయ‌ల్లోని ఔష‌ధ గుణాలు థైరాయిడ్ గ్రంథుల‌పై ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లు పెడ‌తాయి. అయితే మ‌సాజ్ చేసిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను గొంతుపై అలాగే ఉంచ‌డం మంచిది.

ఎందుకంటే అవి థైరాయిడ్ గ్రంథుల ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. శ‌రీరానికి హాని క‌లిగించే బాక్టీరియాల‌ను నిర్మూలించ‌డంలో ఉల్లిపాయ‌లు అమోఘంగా ప‌నిచేస్తాయి. ఇవి శారీర‌క ఆరోగ్యాన్ని క‌లిగించ‌డ‌మే కాదు, వెంట్రుక‌లు, చ‌ర్మం సంర‌క్ష‌ణ‌, మాన‌సిక ఏకాగ్ర‌త వంటి అనేక అంశాల్లో ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయి. అంతేకాదు క్యాన్స‌ర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. ఇలా ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker