మీ కళ్లు ఎర్రబడుతున్నాయా.? అది దేనికీ సంకేతమో తెలిస్తే షాక్ అవుతారు.
పొల్యూషన్ వల్ల పట్టణ, నగర వాసులకు కళ్లు ఎర్రబడడం, దురద రావడం సర్వసాధారణం. అధిక పొల్యూషన్ కారణంగా కళ్లు పొడిగా మారడం, లేదా నీరు కారడం, వంటి లక్షణాలను మనం గమనిస్తుంటాం. కానీ ఇవే సమస్యలు ధీర్ఘకాలంలో కంటి చూపునకు నష్టం కలిగిస్తాయి. అయితే నిజానికి కళ్ల గురించి, వాటి ఆరోగ్యం గురించి పట్టించుకునే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. కళ్లు చాలా సున్నితమైనవి. వీటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే.. మీ కంటిచూపు దెబ్బతినొచ్చు. మొత్తం కంటిచూపే పోవచ్చు.
అందుకే కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇకపోతే కళ్లు ఎర్రబారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ అలిసిపోతే కూడా కళ్లు ఎర్రబడతాయి. ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లను ఎక్కువ వాడటం వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. తెల్లవార్లు నిద్రపోకున్నా ఇలాగే అవుతుంది. అలాగే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కూడా కళ్లు ఎర్రగా మారతాయి. సంక్రమణకు కారణాలు.. ఇన్ఫెక్షన్ కారణంగా కళ్లు ఎర్రగా మారతాయి.
రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రబడతాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ కారణంగా చాలా సార్లు కళ్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అలెర్జీ కారణంగా..అలెర్జీల వల్ల కూడా కూడా కళ్లు ఎరబడతాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి పువ్వుల అలెర్జీ కూడా ఉంటుంది. పువ్వుల వల్ల కలిగే పుప్పొడి అలెర్జీ కళ్లను ఎర్రగా మారడానికి కారణమవుతుంది. దుమ్ముకు, ధూళికి, మట్టికి అలెర్జీ ఉంటే కూడా కళ్లు ఎర్రగా మారతాయి. కాంటాక్ట్ లెన్స్ కారణంగా.. కాంటాక్స్ లెన్స్ ను ఉపయోగించడం వల్ల కూడా కళ్లు ఎర్రగా అవుతాయి.
కళ్లకు లెన్స్ ను ధరించడం వల్ల చాలా సార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీంతో కళ్లు ఎర్రబడతాయి. రాత్రిపూట కాంటాక్ట్ లెన్సులను ధరించడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కార్నియాలో మంట కలుగుతుంది. బ్లెఫారిటిస్ కారణం కావొచ్చు.. కళ్లు ఎర్రగా మారడానికి బ్లెఫరిటిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల కనురెప్పలు వాపు వస్తాయి. కళ్లు ఎర్రగా మారతాయి. ఈ బ్లెఫారిటిస్ కు బ్యూటీ ప్రొడక్ట్స్ కారణం.
ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. కంటి ఎరుపుదనం తగ్గాలంటే..కళ్లు ఎర్రబడినా.. వాటిని లైట్ తీసుకుని అలాగే వదిలేస్తే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. కంటి సమస్యలు రావొచ్చు. అందుకే వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోండి. ముఖ్యంగా కళ్లు ఎర్రగా మారితే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. ముందుగా కళ్లను శుభ్రంగా కడగండి. ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ చుక్కలను వేయండి. దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్స్, కంటిలోని మురికి తొలగిపోతుంది. కళ్ల ఎరుపుదనం పోతుంది.