Health

ఎర్ర అరటి పండు రోజుకొకటి తింటే సంతానలేమి సమస్యలన్ని మటుమాయం.

సాధారణ అరటిపండ్లతో పోలిస్తే కెరోటినాయిడ్లు, విటమిన్‌-సి ఇందులో అధికం. సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు అయిన గ్యాలోక్యాటకిన్‌, గ్యాలేట్‌, డోపమైన్‌, ఎల్‌-డోప, క్యాటకోలమిన్స్‌ లాంటివి ఇందులో పుష్కలం. అయితే బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటిపండు తింటే చాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మామూలు అరటిపండ్లతో పోలిస్తే ఎరుపురంగు అరటిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రోజుకో అరటిపండును తింటే మంచిది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటారు. బరువు కూడా తగ్గడం కాయమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఎరుపురంగు అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కీడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలిగిస్తుంది. క్యాన్సర్ బారినపడకుండా చూస్తుంది. ఎరుపురంగు అరటిపండ్లకు పంటినొప్పులను దూరం చేసే గుణముంది. ఛాథిలో మంటతో ఇబ్బంది పడేవారు ఎరపు అరటిపండును తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ఎరుపు రంగు అరటి అజీర్తి, ఫైల్స్, కంటి దృష్టి లోపాలను తొలిగిస్తుంది. రోజుకు ఓ అరటిపండును 21 రోజులపాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతోపాటు విటమిన్ సి లోపం తొలిగిపోతుంది. ఎరుపురంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగుపడతాయట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker