మగవారు ఎరుపు అరటి తింటే ఎంత మంచిదో తెలుసా..?
తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎరుపు రంగు అరటి పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ బి6 అధిక మోతాదులో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక లోపం, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయ. అయితే సాధారణ అరటిపండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి.
కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఎరుపు రంగు అరటి పండ్ల ప్రయోజనాలు.. ఒక చిన్న ఎర్రటి అరటిపండులో 90 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ప్రతి రోజు ఉదయం తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్ B6, మెగ్నీషియం, విటమిన్ C కూడా అధిక మోతాదులో లభిస్తాయి.
వీటిని ప్రతి రోజు ఆల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఎర్రటి అరటిపండులో పొటాషియం కూడా అధికంగా పరిమాణంలో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. గుండెపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ అరటి పండ్లు కళ్ళకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే మూలకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఈ ఎరుపు రంగు అరటి పండ్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయట.
ఇందులో విటమిన్‌తో పాటు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి తరచుగా వానా కాలంలో, చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.