News

ఇంద్రభవనాన్ని తలపిస్తున్న రష్మిక ఇల్లు, మీరు ఒకసారి చుడండి.

రష్మిక.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తుంది రష్మిక. ఇక రష్మికకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన దగ్గర ఆరా అనే ఓ పెట్ డాగ్ ఉంది. అప్పుడప్పుడు ఆ పెట్ డాగ్ తో గడుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

అయితే ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక ఒకరు. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని..సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప తో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ ఎఫెక్ట్.. హిందీలోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ అయిపోయింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప ప్రమోషన్లలో భాగంగా బన్నీతో కలిసి రష్యాలో సందడి చేస్తుంది. 2014లో కిరిక్ పార్టీ తో కథానాయికగా కెరీర్ ఆరంభించిన రష్మిక.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ. అయితే క్రేజ్ తో పాటు.. ఈ అమ్మడు ఆస్తులు కూడా భాగానే పెరిగినట్లుగా తెలుస్తోంది. దేశంలోని అనేక నగరాల్లో ఆమెకు సొంతంగా ఇళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రష్మిక స్వగ్రామమైన కర్ణాటకలోని విరాజ్ పేట్ లో ఉన్న ఇంటిని ఎప్పుడైనా చూశారా.

ఎప్పుడూ తన స్థానిక ఇంటిని ప్రేమిస్తానని.. అక్కడ ఆమెకు శాంతి, ఎంతో సౌకర్యాలు లభిస్తాయని పేర్కొంది. రష్మిక విలాసవంతమైన బంగ్లా చుట్టూ అందమైన గ్రీనరీ ఉంది. పర్వావరణాన్ని ప్రేమించడంలోనూ ఈ నేషనల్ క్రష్ ముందుంటుంది. ప్రస్తుతం రష్మిక విజయ్ సరసన వరిసు లో నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker