అమెరికా అబ్బాయితో పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ రష్మీ. మరి సుధీర్ పరిస్థితి ఏంటి..?
ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ పెళ్లి బాజా ఎపుడు మోగుతుందని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా కాబోయే వాడిపై మనసులో మాట బయటపెట్టింది యాంకర్ రష్మి. ఈమెకు కాబోయే వాడు ఒరిస్సాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం కాగా… ఈ జోడీని ప్రేక్షకులు మిస్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. జాతకాలు చూపించానని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ ఈ కామెంట్స్ చేశాడు. స్కిట్ చేయడానికి వేదిక మీదకు వచ్చిన బుల్లెట్ భాస్కర్… యాంకర్ రష్మీ వద్దకు వెళ్లి, మన బాబు(సుడిగాలి సుధీర్) బాగానే జీతాలు ఇస్తున్నట్లు ఉన్నాడు. నా వీడియోలు క్రింద కామెంట్స్ పెడుతున్నారు.
ఒకడైతే ‘ఏరా నీ డిక్కీ బలిసిందా?’ అని కామెంట్ పెట్టాడు, అని రష్మీతో అన్నాడు. అనంతరం బుల్లెట్ భాస్కర్ పక్కన ఉన్న కమెడియన్ నాకు ఒక విషయంలో క్లారిటీ రావాలి, రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటారా? అని అడిగాడు. దానికి సమాధానంగా బుల్లెట్ భాస్కర్… ఖచ్చితంగా చేసుకుంటారు. జాతకాలు కూడా చూపించాను. రష్మీ అమెరికా అబ్బాయిని చేసుకుంటుంది.
సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడు… అని అన్నాడు. దానితో అందరూ గట్టిగా నవ్వేశారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా ఈ కామెంట్స్ చేసినా… రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రష్మీతో పాటు సుధీర్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ కి ఇది కూడా కారణం. సడన్ గా పెళ్లి ప్రకటన చేస్తారనే అనుమానాలు ఉన్నాయి.