రంగనాథ్ ఆత్మహత్య చేసుకునే గంట ముందు ఏం చేసాడో తెలుసా..?
తిరుమల సుందర శ్రీరంగనాథ్ విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. ఈయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. వీరు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించాడు. అయితే రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న రోజునే ఆయన ఒక సన్మాన సభకు ముఖ్య అతిధిగా వెళ్లాల్సి ఉంది.. అందుకే ఆయన్ని స్వయంగా నిర్వాహకులు తీసుకు వెళ్లేందుకు ఇంటికి వచ్చారు.
కానీ ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో ఆయన కూతురుకి సమాచారం అందించారు. అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా ఉరివేసుకొని కనిపించారు. దీంతో అందరీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రంగనాథ్ మొదటి నుంచి చాలా సున్నిత స్వభావులు.. తన భార్య చైతన్యని ఎంతగానో ప్రేమించేవారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే 14 సంవత్సరాల పాటు కన్నబిడ్డలా చూసుకుంటూ ఎన్నో సపర్యలు చేశారు. ఆమె మృతితో డిప్రేషన్ లోకి వెళ్లిపోయారు రంగనాథ్. తన రూమ్ లో దేవుడి పక్కనే ఆమె ఫోటో పెట్టుకొని ఆరాధించేవారు.
తన భార్య మరణం, ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రంగనాథ్ చనిపోయే ముందు ఆయన స్నేహితుడికి ‘గుడ్ బై సార్’ అనే మేసేజ్ పంపారని అంటారు. అంతే కాదు ఆయన రూమ్ లో ఓవైపు గోడపై ‘నా బీరువాలో ఆంధ్రాబ్యాంక్ బాండ్స్ ఉన్నాయి.. అవి పనిమనిషి మీనాక్షికి అప్పగించండి.. డోంట్ ట్రబుల్ హర్’ అని రాసి ఉంచారు.
రంగనాథ్ చివరి రోజుల్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిమనిషి మీనాక్షి చేసిన సేవ మర్చిపోకుండా ఆమెకు తగిన న్యాయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆత్మహత్యకు ముందు రంగనాథ్ మానసికంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా.. ఎంత గొప్ప నటుడైనా మానసికంగా కృంగిపోయి.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది.