Health

ఆనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం, ఈ మొక్క తో 150 కి పైగా రోగాలు నయం.

రణపాల మొక్కలను కుండీల్లో పెంచుకుని పలు రకాల వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్,అనాఫీలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. అయితే రణపాల మొక్క యొక్క ఉపయోగాలు.. జీర్ణాశయ సమస్యలకు రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి.

అలానే అజీర్ణం , మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడే వారికి రణపాల ఆకు మంచి ఔషధం. ఈ ఆకుల్లో వుండే యాంటీఫైరటిక్ వల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వున్న వారికి మంచి మేలు చేస్తుంది. కిడ్నీ సమస్యల నివారణకు.. కిడ్నీ సమస్యలు, కిడ్నీలో స్టోన్ లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజు ఉదయం,సాయంత్రం రెండు చొప్పున తినాలి.

లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ml మోతాదులు తాగవచ్చు. దీనివలన మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. ఈ రణపాల ఆకులను రోజు తినడం వలన డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు చాలా మేలు చేస్తుంది. అలానే మూత్రపిండాల పనితీరు మెరుగ్గా పడుతుంది. ఈ రణపాల ఆకును తినడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.

ఈ ఆకులను ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రణపాల ఆకులను కడిగి రసం తీసి మజ్జిగలో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి. రణపాల ఆకు స్త్రీలలో జరిగే రక్త స్రావాన్నీ కూడా ఆపుతుంది. రణపాల ఆకులను వేడి గడ్డలపైన పెడితే అవి కరిగి పోతాయి.. ఇలా మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker