రమ్యకృష్ణ తల్లి ఎవరో తెలుసా..? అసలు ఆమె ఎలా ఉంటుందో తెలుసా..?
రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు.
ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అయితే హీరోయిన్‌గా, విలన్’గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన నటనతో నేటికీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ.
రమ్య కృష్ణన్ తన అద్భుతమైన నటనతో తెలుగు చిత్రసీమలోనే కాకుండా తమిళ్ , హిందీ చిత్రసీమలో కూడా అగ్ర నటులతో జతకట్టింది. రమ్యకృష్ణ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర , బాహుబలి సినిమాలో శివగామి పాత్రను సినీ అభిమానులు ఎవరు కూడా మరిచిపోలేరు.
ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ.. బాహుబలిలో రాజమాత శివగామి పాత్రతో ఆమెను అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ఇప్పటికీ తన అద్వితీయమైన నటనతో అభిమానులను అలరిస్తున్న నటి రమ్యకృష్ణ తల్లి ఫోటోను చాలా మంది చూసి ఉండరు. నటి రమ్యకృష్ణ తన తల్లితో కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.